హీరోను అన్ని కోణాల్లో చూపించాలంటే అది వి వి వినాయక్ కు మాత్రమే సాధ్యం.. ఎన్నో రకాల సినిమాలను టాలీవుడ్ కు పరిచయం చేసాడు. చాలా సినిమాలు హిట్ అయ్యాయి కూడా. ఆయన తెరకెక్కించిన సినిమాల విషయానికొస్తే.. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, అదుర్స్, ఖైదీ నెం. 150 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అగ్రదర్శకుడుగా మంచి పాపులారిటీని సంపాదించాడు. 


ఇకపోతే సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టడం వినాయక్ నైజం. అసలు విషయానికొస్తే ఈ దర్శకుడు కి అనుకున్న హిట్ సినిమాలు లేవు. దానితో ఆ మాస్ డైరెక్టర్ హీరో గా తన రూట్ మార్చుకున్నాడు. ‘సీనయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రెంచ్ పట్టుకుని మెడలో ఎర్ర తుండు వేసుకుని ఊరమాస్ అవతారంలో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇకపోతే రేపు వినాయక్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ను అనౌన్స్ చేశారు ఆ చిత్ర యూనిట్. 


హీరోలతో స్టెప్పులు వేయించిన వినాయక్ ఈ సినిమా కోసం బాగా జిమ్ చేసి మారి కనిపించాడు. రైతుల కష్టం తెలిసిన రైతు బంధుడిగా అయన ఈ సినిమాలో నటిస్తున్నారు. అయన గెటప్ కు, సెటప్ కి ఈ సినిమా కరెక్టుగా ఈ సినిమా కథ ఉండటంతో మాట మాత్రం మాట్లాడకుండా ఓకే చెప్పాడు. 


ఈ సినిమాకు ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. దిల్ రాజ్ దిల్ సినిమాను నిర్మించి  ఆ సినిమా వచ్చి ఇప్పటికి 15  ఏళ్ళు అవ్వడంతో ఆ చిత్ర దర్శకుడితో హీరోగా అదే దిల్ రాజ్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.రేపు వినాయక్ బర్త్ డే సందర్బంగా అన్నపూర్ణ స్టూడియోలో షూట్ ప్రారంభం అవుతుంది. ప్రముఖులుఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: