మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులు, ప్రేక్షకులు ఊహించేది డ్యాన్సులు, ఫైట్లు. అవి లేని చిరంజీవి సినిమాను ఎవరూ ఊహించలేరు. కానీ సైరా.. తో చిరంజీవి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు. ముఖ్యంగా తెలుగు సినిమాలకు సరిపడని, ప్రేక్షకులు ఇష్టపడని యాంటీ క్లైమాక్స్ ను చిరంజీవి మెగాస్టార్ ఇమేజ్ తో చేసి ఒప్పించారు. తన ఇమేజ్ కు తగ్గట్టుగా కాకుండా చిరంజీవి భిన్నంగా వెళ్లి సక్సెస్ అయిన సందర్భాలు గతంలోనూ జరిగాయి.

 


మాస్ క్యారెక్టర్లు, వంద మంది రౌడీలను అవలీలగా చితక్కొట్టే హీరోయిజాన్ని మాత్రమే చిరంజీవి నుంచి ఊహించగలం. 1995లో రిక్షావోడు సినిమా ఫ్లాప్ అనంతరం గ్యాప్ తీసుకున్న చిరంజీవి మాస్ మూస నుంచి బయటకు రావాలని ప్రయత్నించి దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని మళయాళ హిట్ చిత్రం హిట్లర్ ను ఎంచుకున్నారు. అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా, కుటుంబ బరువు బాధ్యతలు మోసే వ్యక్తిగా ఆ సమయంలో ఆయన్ను ఊహించడం కష్టం. కానీ చిరంజీవి ఆ సెంటిమెంట్ ను నెగ్గుకొచ్చి హిట్లర్ ను హిట్ గా నిలబెట్టారు. ఇప్పుడు సైరా విషయంలోనూ అదే జరిగింది. చిరంజీవి బలమైన కామెడీ, పాటలు, డ్యాన్స్.. ఇవేమీ లేకుండా కేవలం తన మెస్మరైజింగ్ యాక్టింగ్ తో సైరాను నిలబెట్టారు. చిరంజీవి నటన గురించే అందరూ మాట్లాడుకోవడం ఇందుకు నిదర్శనం.



ఏ తెలుగు సినిమా క్లైమాక్స్ ను సాడ్ ఎండింగ్ చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడరు. కానీ ఇక్కడ చిరంజీవి క్లైమాక్స్ సీన్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ముఖ్యంగా మెగా అభిమానులను మెప్పించడం చిరంజీవికే చెల్లింది. తమిళ ప్రేక్షకులు మాత్రమే ఒప్పుకునే సాడ్ ఎండింగ్ ను తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమా చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: