నందమూరి సింహం బాలకృష్ణ కు నమ్మకాలు ఎక్కువ. జాతకాలను,వాస్తు సిద్దాంతాలను బాలయ్య బాగా నమ్ముతాడు. చివరకు పెద్దగా నమ్మకాలు లేని చంద్రబాబునే ఓప్పించి హైదరాబద్ లో ఎన్టీఆర్ భవన్ కు వాస్తు మార్పులు చేయిస్తున్నాడు. అటువంటి బాలయ్య చాల గేప్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న ‘లెజెండ్’ సినిమాలో కూడా ఈ నమ్మకాలను కొనసాగిస్తున్నాడు.  ప్రస్తుతం బాలకృష్ణ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలలో బిజీగా విశాఖపట్నంలో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అదే జిల్లాలోని కొత్త వలస రైల్వే స్టేషన్ పట్ల బాలయ్యకు ఒక గట్టి సెంటిమెంట్ ఉంది. బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ‘సమర సింహ రెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కొత్త వలస రైల్వే స్టేషన్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం బాలయ్య కెరియర్ లో అత్యధిక బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ‘లెజండ్’ సినిమాలో కొన్ని ముఖ్య సన్నివేశాలు కొత్త వలస రైల్వే స్టేషన్ లో ఈమధ్యనే దర్శకుడు బోయపాటి చిత్రీకరించారు.  బాలకృష్ణ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకోవడమే కాకుండా రాబోతున్న ఎన్నికలలో బాలయ్య ఇమేజ్ కు సంబంధించిన ముఖ్య చిత్రంగా ఈ ‘లెజండ్’ మారుతూ ఉండటంతో కొత్త వలస రైల్వే స్టేషన్ బాలయ్యకు ఎటువంటి అదృష్టాన్ని కలగచేసి ఎన్నికల తరువాత బాలయ్యకు ఎటువంటి రాజకీయ భవిష్యత్ ను ఇస్తుందో చూడాలి...   

మరింత సమాచారం తెలుసుకోండి: