ప్రస్తుతం తన వెన్ను నొప్పికి కేరళా ప్రకృతి వైద్యం చేయించుకుంటూ ఎవర్ని కలవకుండా తన ఇంటిలోనే ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో మొన్న దసరా పండుగ రోజున చరణ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలవడమే కాకుండా ప్రస్తుతం పవన్ తీసుకుంటున్న వైద్యం గురించి అడిగినట్లు టాక్. 

అంతేకాదు ఇలాంటి మొండి వెన్ను నొప్పి సమస్యలకు ప్రస్తుతం చాల సమర్ధవంతంగా వైద్యం చేస్తున్న ఆస్ట్రేలియా డాక్టర్ వివరాలు అందించి పవన్ ను తన ఆరోగ్య సమస్యల విషయమై ఎటువంటి అశ్రద్ధ చేయవద్దని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో చరణ్ ‘సైరా’ కలక్షన్స్ గురించి పవన్ కు వివరించడమే కాకుండా పవన్ అంగీకరిస్తే తాను తన సొంత బ్యానర్ పై ఒక భారీ సినిమా తీయాలనే కృతనిశ్చయంలో ఉన్నట్లు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ మాటలకు పవన్ స్పందించకుండా ముందు తన అనారోగ్య సమస్యలు తీరిన తరువాత చరణ్ ఇచ్చిన ఆఫర్ గురించి ఆలోచిస్తాను అని అనడమే కాకుండా నిర్మాతగా చరణ్ విజయాలు సాధిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ చరణ్ పై తన అభిమానాన్ని వ్యక్త పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి పవన్ సినిమాలలో చేస్తాను అంటే అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూలో ఉన్నారు.

ఇప్పటికే పవన్ ముగ్గురు ప్రముఖ నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు పుచ్చుకుని వారి విషయమై కూడ ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు అని వార్తలు విని పిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రస్తుతం ‘జనసేన’ లో జరుగుతున్న పరిణామాలు పవన్ ను తీవ్రంగా కలిచివేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘జనసేన’ పార్టీలోని అనేకమంది నాయకులు పవన్ కు ఒక్క మాట కూడ చెప్పకుండా పార్టీని వదిలి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ బిజెపి లలోకి వెళ్లిపోతు ఉండటంతో ‘జనసేన’ ఖాళీ అయిపోతోంది అని వస్తున్న వార్తల మధ్య పవన్ సినిమాలలో తిరిగి నటించాలా లేదంటే ‘జనసేన’ కు జవసత్వాలు అన్న విషయమై తేల్చుకోలేకపోతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: