తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్చులర్ అంటే మెయిన్ గా వినపడే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాష్.. ఈయన వయస్సు మూడు పదులు దాటి చాలా కాలం అయింది. అయితే ఆయన ఎక్కడకు వెళ్లింది కూడా పెళ్లి మాట వినపడితే చెప్పుకోలేక ప్లీస్ నాకు చేసుకోవాలని లేదు. ఒక వేళ నేను చేసుకుంటే మీకు ముందుగా చెబుతాను అని తప్పించుకుంటూ వస్తున్నాడు.. అలా ఇంకా అనుష్కకు ఈయనకు ప్రేమాయణం నడుస్తుందని కూడా చాలా మంది అనుకున్నారు. 


బాహుబలి సినిమా తర్వాత ప్రభాష్ రేంజు ఏ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా పాకిందో అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రభాష్ సినిమాల్లోకి రావడం అతని తల్లికి అస్సలు ఇష్టముందేది కాదట. ప్రభాష్ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఓ ఇల్లు నిర్మించుకొని హ్యాపీగా ఉండాలని ఎప్పుడు అనుకొనేదని ప్రభాష్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే..


కానీ పెద్దనాన్న కృష్ణంరాజు సినిమా లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనతో కలిసి సినిమా షూటింగ్ స్ కు వెళ్లడం వల్ల నేను అనుకోకుండా సినిమాల్లోకి వెళ్ళిపోయాను అంటూ ప్రభాష్ చెప్పుకొచ్చాడు. అలా రాఘవేంద్ర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలా ఒక్కో సినిమాలో నటిస్తూ వచ్చాడు. ఆయన చేసిన సినిమాలలో రెండు మూడు సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి..


సాహో సినిమాలో తాజాగా నటించారు. ఆ సినిమా అనుకున్న విదంగా రాలేదు .. యాక్షన్ కోణంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ అయితే పూర్తిగా రాబట్టింది గాని .. హిట్ టాక్ ని సొంతం చేసుకోలేక పొయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో రావణ చిత్రంలో విలన్ పాత్రలో కనిపిస్తున్నారు.. మరో భారీ ప్రాజెక్టులో కూడా నటిస్తున్నారు. మరి ఆ సినిమా అయినా కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: