రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించినా.. రెండో సినిమా గీత గోవిందంలో మాత్రం కాస్త రెచ్చిపోయింది. నాభి అందాలు, అదర చుంబనాలతో వేడెక్కించింది.  గీత గోవిందం సినిమాలో విజయ్.. రష్మికల మధ్య జరిగిన ముద్దు సీన్లు అదరగోట్టాయి.  ముద్దు సీన్స్ కారణంగానే సినిమా బంపర్ హిట్ కొట్టింది.  


ఈ సినిమా హిట్ తరువాత రష్మిక మరో కొన్ని సినిమాలు చేసింది.  విజయ్ దేవరకొండతోనే డియర్ కామ్రేడ్ సినిమా చేసినా వర్కౌట్ కాలేదు.  అందులో కూడా అదరచుంబనాలు మాములుగా లేవు.  ఒక రేంజ్ లో ఉన్నా సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ లేకపోవడంతో సినిమా ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు రష్మిక సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నది.  ఈ సినిమాపైనే ఈ అమ్మడు బోలెడు అసలు పెట్టుకుంది.  


ఇక ఇదిలా ఉంటె, రష్మిక లిప్ లాక్ సీన్స్ పై మరో కన్నడ నటి హరిప్రియ కామెంట్స్ చేసింది.  తాను నటించిన ఎల్లిదే ఇల్లితనక కన్నడ సినిమాలో ముద్దు సీన్లు ఉన్న అవి మాములుగానే ఉన్నాయని, రష్మికలా లిప్ లాక్ సీన్స్ కాదని చెప్పింది.  తాను నటించే సినిమాలు తన తల్లిదండ్రులతో కలిసి చూసేందుకు వీలుగా ఉండే విధంగా చూసుకుంటానని అలాంటి సినిమాల్లోనే నటిస్తానని చెప్పింది.  కన్నడ సినిమాల్లో నటించే అవకాశం తనకు రావడం గొప్ప విషయంగా పేర్కొన్నది. 


గతంలో హరిప్రియ తెలుగులో తకిట తకిట, పిల్ల జమిందార్, జైసింహ సినిమాల్లో నటించింది.  ఆ తరువాత సొంత పరిశ్రమ కన్నడకు వెళ్ళిపోయింది.  ఇప్పుడు అక్కడ ఎల్లిదే ఇల్లితనక సినిమాలో నటించింది.  ఈ మూవీ ఈరోజు రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై హరిప్రియ బోలెడు ఆశలు పెట్టుకున్నది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. మరికాసేపు ఆగాల్సిందే కదా.  రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.  సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్టయితే రష్మిక తప్పకుండా టాప్ హీరోయిన్ గా స్థిరపడినట్టే.  


మరింత సమాచారం తెలుసుకోండి: