ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉండటమే కాకుండా వారందరి చేత ప్రభాస్ ‘డార్లింగ్’ అంటూ ప్రేమగా పిలిపించుకుంటూ ఉంటాడు. ‘సాహో’ మూవీ భయంకరమైన ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నా ఆ మూవీ దేశ వ్యాప్తంగా దాదాపు 450 కోట్లకు పైగా కలక్షన్స్ తెచ్చుకుంది అంటే ప్రభాస్ స్టామినా ఏమిటో అర్ధం అవుతుంది.

ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ తన అభిమానులను ఉద్దేసించి షేర్ చేసిన ఒక వీడియో పై కొందరు సెటైర్లు వేస్తున్నారు.ప్రభాస్ ను నేషనల్ స్టార్ గా మార్చిన ‘బాహుబలి 2’ ప్రదర్శన లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ నెల 19న జరగబోతోంది. 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘హారి పోర్టర్’ లాంటి కొన్ని ప్రముఖ సినిమాలతో పాటు ‘బాహుబలి’ ని ప్రత్యేకంగా లండన్ నగరంలోని ప్రముఖుల కోసం రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనకు ఎలిజిబత్ రాణి కుటుంబ సభ్యులు కూడ రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు రానా రాజమౌళి కీరవాణి అనుష్క తమన్నాలు హాజరు కాబోతున్నారు. ఈ సినిమా ప్రదర్శనకు ముందు లండన్ మీడియా ప్రత్యేకంగా రాజమౌళిని కొన్ని ప్రశ్నలు వేయబోతోంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఒక లైవ్ ఆర్కెస్ట్రాను కూడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఈ వివరాలు అన్నీ ప్రభాస్ తన అభిమానులకు షేర్ చేస్తూ ఒక ప్రత్యేకమైన వీడియోని విడుదల చేయడమే కాకుండా ప్రభాస్ తన అభిమానులందరినీ లండన్ రావలసిందిగా ఆహ్వానించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభాస్ పిలుపు పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అభిమానులు బస్సులు కార్లు పెట్టుకుని వచ్చినంత సులువుగా లండన్ ప్రభాస్ అభిమానులు రాలేరు కదా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: