తేజస్వి దర్శకత్వంలో హరిప్రియ, సృజన్‌ లోకేశ్‌ జంటగా నటించిన తాజా కన్నడ చిత్రం ‘ఎల్లిదే ఇల్లితనకా’ ఈ  శుక్రవారం (11) విడుదలైన సంగతి మన అందరికీతెలిసిందే.. ఆమె తెలుగులో ‘తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహా’ వంటి  వరుస   చిత్రాల్లో  హరిప్రియ నటించారు.

‘జై సింహా’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించని హరిప్రియ కన్నడలో మాత్రం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా  విడుదలయిన   'ఎల్లిదే ఇల్లితనకా'  సినిమాలో సృజన్, హరిప్రియల మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది. అయితే ఈ లిప్ లాక్ ను గీత గోవిందంలో విజయ్ – రష్మిక లిప్ లాక్ తో పోలుస్తున్నారు. ఇదే విషయమై హరిప్రియను అడిగిన మీడియాకు ఆమె ఘాటైన సమాధానం ఇచ్చింది. ‘గీత గోవిందంలో విజయ్ – రష్మిక మధ్య లిప్ లాక్ జరిగింది, నాకు సృజన్‌కు మధ్య కిస్ సీన్ మాత్రమే జరిగింది.

నా లిమిట్స్ నాకు తెలుసు.‘‘నా సినిమాలను నా అభిమానులు, ప్రేక్షకులు వారి కుటుంబంతో సహా చూడాలనుకుంటాను. ఇప్పటి వరకూ రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో నేను నటించలేదు. కాకపోతే ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రంలో కథకు అవసరం కాబట్టి ముద్దు సన్నివేశంలో పాల్గొన్నా. అయితే అది రష్మికా మండన్నాలా లిప్‌లాక్‌ సన్నివేశం కాదు. నాది మామూలు ముద్దే’’ అన్నారు. సినిమా ఒప్పుకునే ముందే నా పాత్రను చూసుకుంటాను’ అని సమాధానం ఇచ్చింది. దీంతో రష్మికపై ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.


చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఇటివల విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ లో నటించింది. విజయ్ – రష్మిక కాంబో టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ పెయిర్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య లిప్ లాక్స్ ఉన్నాయి. వీటినుద్దేశించే హరిప్రియ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: