ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు మ‌ళ్లీ చెప్పాడు ర‌జినీకాంత్. రాజ‌కీయాల‌పై ర‌జినీకాంత్ కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.. ఏదైతే ప్ర‌జ‌లు ఊహించారో అదే జరిగింది, అదే చెప్పాడు సూప‌ర్ స్టార్. తాను ప్ర‌స్తుతం రాజకీయాలకు సిద్ధంగా లేన‌ని తెలిపాడు ర‌జినీ. 2021 ఎన్నిక‌లే త‌న‌కు ల‌క్ష్యం అని.. దాని కోసం ఇప్ప‌ట్నుంచే సిద్ధ‌మ‌వ్వాలంటూ అభిమానుల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చాడు ర‌జినీకాంత్. ఈ విషయంపై గతంలో ఓ ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసాడు ర‌జినీకాంత్. దానికితోడు గతంలో కంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడు రజినీకాంత్ ప్రస్తుతం.


గత ఏడాది కిందే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్ అని అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు మాట మారుచేసాడు . 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు తాను పోటీ చేయ‌డం లేద‌ని తెలిపారు. చెప్పినట్లే దూరంగా ఉన్నాడు. దాంతో పాటే ఎవ‌రికీ స‌పోర్ట్ కూడా  చేయ‌న‌ని తెలియచేసాడు. త‌న ఫోటోను వాడుకున్నా.. త‌న పేరు మీద ప్ర‌చారం చేసినా.. తాను స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు ఏ పార్టీ అయినా తెలిపిన  కూడా న్యాయప‌ర‌మైన చ‌ర్యలు త‌ప్ప‌వంటున్నాడు సూప‌ర్ స్టార్. 


మరోవైపు కమల్ మాత్రం ముందుకు వెళ్తున్నాడు.  ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ మురుగ‌దాస్ దర్బార్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా అంత పూర్తి అయిపొయింది. సంక్రాంతికి సినిమా విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సిరుత్తై శివతో సినిమాకి కూడా  కమిట్మెంట్ ఇచ్చాడు సూపర్ స్టార్.

ఇలా వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ పోతే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఎందుకు తెలిపారు అని ర‌జినీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు అభిమానులు. దీనితో  ర‌జినీకాంత్ బయటికి వచ్చి మ‌రో ఏడాది పాటు సినిమాలు చేసి.. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో వస్తాను అని తెలియచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: