విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ  వెంకీమామ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.  ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దీనితో  సినిమా షూటింగ్ మొత్తం  పూర్తికానుంది. ఇక ఈ చిత్రాన్ని మొదటగా దసరా కు ప్రేక్షకులముందుకు తీసుకురావాలని  అనుకున్నారు. కానీ  షూటింగ్ లో  వెంకటేష్ గాయపడడం అలాగే  దసరా కు సైరా  విడుదలకావడంతో   పోటీ నుండి తప్పుకుంది. ఆతరువాత సోలోగా దీపావళికి  బరిలో నిలపాలని అనుకున్నారు. కానీ అప్పటికి  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడం లేదు.  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కాబట్టి  ఎలాగైనా పండగ కే సినిమా విడుదలచేస్తే  బాగుంటుందని  మేకర్స్ నిర్ణయంచుకున్నారు.  దాంతో ఈ చిత్రం ఇప్పుడు సంక్రాంతి కి బరిలోకి  దిగనుందని సమాచారం.  ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు ఇప్పటికే  కొన్ని థియేటర్లలను బ్లాక్ చేసిపెట్టారట. సో  వెంకీమామ సంక్రాంతికి రావడం పక్కా. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ విషయంలో అధికారిక ప్రకటన వెలుబడనుంది. 



ఇదిలా ఉంటే ఇప్పటికే పండుగకు  మహేష్ బాబు ,సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ అల .. వైకుంఠపురములో ,రజినీకాంత్, దర్బార్ , కళ్యాణ్ రామ్ , ఎంత మంచివాడవురా సినిమాలు  బెర్తులను ఖరారు చేసుకున్నాయి. మరి  ఇంత పోటీలో  వెంకీమామ  ను విడుదల చేస్తున్నారంటే సినిమాలో విషయం వుండే ఉంటుంది.  మరి ఈ చిత్రం  ఎలాంటి ఫలితాన్ని  రాబడుతుందో చూడాలి. జై లవకుశ ఫేమ్  బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా   నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నానటిస్తుంది.  తమన్ సంగీతం అందిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: