ఇళయ దళపతి విజయ్ నటించిన  లేటెస్ట్  మూవీ బిగిల్ యొక్క  ట్రైలర్  కొద్దీ  గంటల క్రితం యూ ట్యూబ్ లో విడుదలైయింది. ఇలా విడుదలయ్యిందో లేదో కేవలం గంటలో  7మిలియన్ల రియల్ టైం వ్యూస్ ను అలాగే 10లక్షల లైక్స్ ను రాబట్టుకొని ఆల్ టైం రికార్డు సృష్టించింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు  బిగిల్ పై ఎలాంటి అంచనాలు వున్నాయోనని. ఇక  యాక్షన్ , కామెడీ , రొమాన్స్ , ఎమోషన్స్ ఇలా ఏఒక్కటి కూడా మిస్ కాకుండా  ట్రైలర్ ను అద్భుతంగా  కట్ చేసి అదుర్స్ అనిపించాడు డైరెక్టర్ అట్లీ. విజయ్ ఫ్యాన్స్ ను ఈ ట్రైలర్  విశేషంగా అలరిస్తుంది.  మరి 24 గంటల్లో ఈ ట్రైలర్  ఇంకెన్ని రికార్డులు  సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రం తెలుగులో విజిల్ గా విడుదలకానుంది. అయితే తెలుగు వెర్షన్ ట్రైలర్  ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి వుంది. విజిల్ హక్కులను  మహేష్ ఎస్ కోనేరు దక్కించుకోగా  తెలుగు రాష్ట్రాల్లో 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో  కూడా సోలో గా విడుదలకానున్నడం  ఈ చిత్రానికి కలిసి రానుంది. 



భారీ బడ్జెట్ తో  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈచిత్రం దీపావళి కానుకగా  అక్టోబర్ 24 న లేదా  25 న కానీ  విడుదలకానుంది.  త్వరలోనే ఈ రీలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఇక  విజయ్ -అట్లీ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో తెరకెక్కిన  తెరి, మెర్సల్ సూపర్ హిట్లు అయ్యాయి. మరి ఈ బిగిల్   వీరికి  హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: