ఎప్పటిలాగే వచ్చే సంక్రాంతికి కూడా భారీ పోటీ ఉండబోతున్నది.  సంక్రాంతికి  సినిమాలు ఏంటి  అన్నది ఇప్పటికే ఓ క్లారిటీ  వచ్చింది.  సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నది.  అందులో మొదటగా రిలీజ్ కాబోతున్న సినిమా రజినీకాంత్ దర్బార్.  రజినీకాంత్.. మురుగదాస్  కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో సినిమాపై నమ్మకం ఎక్కువగా ఉన్నది.  


పైగా ఇందులో రజినీకాంత్ దాదాపు 25 ఏళ్ల తరువాత పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.  ముంబై మాఫియాకు రజినీకాంత్ ఎలా చెక్ పెట్టాడు అన్నది కథ.  మురుగదాస్ ఇలాంటి కథతో సినిమాలు తీయడం వెన్నతో పెట్టిన విద్య.  గతంలో వచ్చిన తుపాకీ సినిమా కూడా ఇదే విధమైన కంటెంట్ తో తెరకెక్కింది.  ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.  


ఇప్పుడు రజినీకాంత్ తో చేస్తున్న సినిమా కూడా అదే విధంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  ఇక దర్బార్ సినిమా జనవరి 10 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఐదు సినిమాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా దర్బార్ కావడం విశేషం.  ఒకవేళ దర్బార్ కు పాజిటివ్ టాక్ వస్తే.. తెలుగులో మిగతా సినిమాలకు కొంత ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది.  


ఎందుకంటే తెలుగులో టాప్ హీరోలకు ఏ స్థాయిలో పేరు ఉన్నదో.. రజినీకాంత్ కు కూడా అదే స్థాయిలో పేరు ఉన్నది.  ఫ్యాన్స్ ఉన్నారు.  ముఖ్యంగా హైదరాబాద్ లో తలైవా ఫ్యాన్స్ అధికం.  గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి.  దర్బార్ సినిమా అంచనాలకు అందుకుంటే.. తెలుగులోనే వందకోట్లు సాధిస్తుంది.  అటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  తమిళం సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.  సినిమా హిట్ పడితే.. దేశవ్యాప్తంగా నాన్ బాహుబలి రికార్డులు మొత్తం బద్దలు కావడం ఖాయం అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: