తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమై ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదట్లో బాగానే రేటింగ్స్ వచ్చినా ఆ తరువాత వారాల్లో రేటింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఈ వారం ఎలిమినేషన్ కు రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, మహేశ్ విట్టా నామినేట్ అయ్యారు. ఈ ముగ్గురిలో ఈ వారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. 
 
ఈ వారం ఎలిమినేషన్ కు వరుణ్, రాహుల్, మహేశ్ నామినేట్ అయిన సమయంలోనే రాహుల్, వరుణ్ తో పోలిస్తే మహేశ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రేక్షకులు కూడా అంచనా వేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన రోజు నుండి మహేశ్ విట్టాపై కొన్ని విమర్శలున్నాయి. బాబా భాస్కర్ కు ఎంతో సన్నిహితుడైన మహేశ్ విట్టా కొన్ని సందర్భాల్లో బాబా భాస్కర్ గురించి ఇంటి సభ్యుల దగ్గర చెడుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 
 
నిజానికి శ్రీముఖి ఫ్యాన్స్ మహేశ్ విట్టాకు ఓట్లు వేద్దామని అనుకున్నా శ్రీముఖిని మహేశ్ టార్గెట్ చేయటంతో శ్రీముఖి ఫ్యాన్స్ వెనక్కు తగ్గారు. బాబా భాస్కర్ తో కూడా అంత సన్నిహితంగా లేకపోవటంతో మహేశ్ విట్టాకు తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. నిజానికి మహేశ్ విట్టా గత వారమే ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించినా పునర్నవికి తక్కువ ఓట్లు రావటంతో మహేశ్ సేవ్ అయ్యాడు. కానీ ఈ వారం మాత్రం మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. 
 
మరోవైపు బిగ్ బాస్ సీజన్ 3 కొన్నిరోజుల్లో పూర్తి కాబోతూ ఉండటంతో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనే చర్చలు కూడా నడుస్తున్నాయి. శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్ ఈ నలుగురిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలీ రేజా రీఎంట్రీ కాబట్టి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉండదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: