రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమా విషయంలో రాజమౌళి ఎలా ఉంటాడో చెప్పక్కర్లేదు.  ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంటారు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చేస్తున్న సినిమా కాబట్టి సినిమాకు మరింత పేరు వచ్చే అవకాశం ఉన్నది.  ఈ సినిమాను దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.  బాబుబలి తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  


దీనికి మాటల రచయితగా సాయి మాధవ్ బుర్ర పనిచేస్తున్నారు.  సాయి మాధవ్ బాహుబలి సినిమాకు పనిచేయాల్సి ఉన్నా.. కొన్ని కారణాల  వలన కుదరలేదు.  అయితే, ఈ ఆర్ఆర్ఆర్ సినిమాకు కలిసి పనిచేస్తున్నారు.  ఈ సినిమా గురించిన కొన్ని విషయాలను సాయి మాధవ్ మీడియాతో పంచుకున్నారు.  రాజమౌళి ఈ సినిమాను ఎప్పుడో చూసేశారని, దాన్ని ప్రేక్షకులకు చూపించడానికి కష్టపడుతున్నారని అన్నారు.  


ఇక సినిమా కథను కూడా అయన రివీల్ చేశారు.  ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో స్వాతంత్ర సమయంలో పాల్గొన్న వీరుల్లో అల్లూరి సీతారామ రాజు, కొమరం భీంలు ముఖ్యమైన వ్యక్తులు.  ఈ ఇద్దరు తెల్లదొరలపై పోరాటం చేశారు.  అయితే, కొంతకాలం వేరు అజ్ఞాతంలో ఉన్నారు.  అలా అజ్ఞాతంలో ఉండగా ఈ ఇద్దరు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో రాజమౌళి సినిమా తీస్తున్నారట.  ఇది చారిత్రాత్మక నేపధ్యం కలిసిన సినిమా అయినప్పటికీ ఇందులో కల్పితం ఉన్నది.  


ఆ కల్పితమే ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండబోతుంది.  ఆ కల్పితం ఎలా ఉన్నది.  ఎలా కల్పించారు.  ఎలా మెప్పించారు అన్నది ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు.  ఇప్పటికే దాదాపుగా 40% షూటింగ్ పూర్తయింది.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ బయటకు రాబోతున్నది.  ఆ న్యూస్ ఏంటి దీనిపై ఉంటుంది అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజమౌళి.  


మరింత సమాచారం తెలుసుకోండి: