కోలీవుడ్ కల్ట్ మూవీ  '96' ఇప్పుడు  తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ రీమేక్ లో  శర్వానంద్ , సమంత జంటగా నటిస్తుండగా ఒరిజినల్ వెర్షన్  డైరెక్టర్  ప్రేమ్  కుమార్  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  ఈ  రోజు తో సమంత తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేసింది.  ఈ సందర్భంగా విడుదలచేసిన సమంత స్టిల్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  జాను అనే టైటిల్ ప్రచారం లో వుంది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ పై  దిల్ రాజు నిర్మిస్తున్న  ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. ఈనెలలో  ఈసినిమా షూటింగ్ ను  కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న  ప్రేమికుల రోజు కానుకగా  ఈ చిత్రాన్ని విడుదలచేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.



ఇక ఇటీవల ఓబేబి తో ప్రేక్షకులముందుకు  వచ్చి సూపర్ హిట్ కొట్టింది  సమంత. కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం  30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది. అయితే ఈ చిత్రం తరువాత  సమంత ఇంతవరకు  మరో సినిమాకు సైన్ చేయలేదు. దాంతో సమంత త్వరలోనే సినిమాలకు  గుడ్ బై చెప్పనుందనే ఊహాగానాలు వెలుబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల పడి పడి లేచె మనసు , రణరంగం రూపంలో  డిజాస్టర్ లను చవిచూసిన శర్వానంద్ జయాపజయాలతో  సంబంధం లేకుండా  వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అందులో భాగంగా   ప్రస్తుతం శర్వా ,96 రీమేక్ తో పాటు శ్రీకారం అనే చిత్రంలో నటిస్తుండగా ఇటీవలే తమిళ డైరెక్టర్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: