ఈ టీవీలో ప్రతీ సోమవారం రాత్రి "ఆలీతో సరదాగా" అంటూ కమెడియన్ ఆలీ గారు టీవీ ప్రేక్షకుల కోసం ప్రతివారం సరదాగా ఓ అతిధి ని పిలుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వారం సరదాగా మన చలపతిరావు గారబ్బాయ్ రవిబాబు ని పిలుస్తున్నట్టుగా ఓ ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు సరదాగా ఆలితో రవిబాబు పంచుకున్న కొన్ని విశేషాలు ఇపుడు మీ కోసం :- 

అల్లరి సినిమాతో దర్శకుడిగా తనను నిరూపించుకున్న రవిబాబుని ఆ చిత్ర సమయంలో అది నిర్మించిన ప్రొడ్యూసర్ మాత్రం అదో చెత్త సినిమా అంటూ తనపై ఫైర్ అయ్యారని రవిబాబు చెప్పుకొచ్చారు. రవిబాబును చూసి భయపడే దాన్నంటూ అల్లరి ఫేమ్ సుభాషిణిని గతంలో అదే ఇంటర్వ్యూలో ఆలీతో చెప్పడంతో..  ఎందుకు అంటూ ఆలీ ప్రశ్నించగా.. దానికి బదులుగా రవి అది ఆమెకు మొదటి సినిమా అని.. డైలాగ్ సరిగా చెప్పేది కాదని.. అలాంటి సమయంలో నేను ఏం చేయాలంటూ చెప్పి నవ్వేశారు.. 

నీ డైరెక్షన్‌లో మేం చేయలేం అని మీ మీద ఓ నటుడు ఫైర్ అయ్యారా??.. అని ఆలీ గారు ప్రశ్నించగా.. ఇంకెవరు మా నాన్న చలపతి రావే అన్నారు.. అవును సినిమా షూటింగ్ సినిమాలో జరిగిన సంగతులను గుర్తుచేస్తూ ఆ చిత్ర షూటింగ్‌లో హీరోయిన్ ఫైర్ అయిందట కదా అని అడగ్గా.. కెమెరాలో ఫొటో షూటింగ్ కోసం గంటపాటు ఆమెను రోప్‌తో వేలాడదీశామంటూ..,, తర్వాత ఫోటోలు ఎలా ఒచ్చాయో పరిశీలిద్దాం అని తాను చూస్తున్న సమయంలో కెమెరామెన్ చిప్ పెట్టడం మర్చిపోయనని చెప్పడంతో ఆమె అసహనం ఫీల్ అయి అరిచేసారని చెప్పారు. పెద్ద హీరోలతో సినిమాలు ఎందుకు తీయలేదు.. అని అడగ్గా.. ఇక్కడి వచ్చే పెద్ద హీరోలను మీరే అడగండి.. రవిబాబుతో ఎందుకు తీయలేదు? అని రివర్స్ కౌంటర్ వేసి నవ్వుకున్నారు. కమెడియన్ గా, విలన్ గా, దర్శకుడు గా, ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న రవిబాబు ఆలితో ఎంత సరదాగా గడిపారో తెలీదు..,, కానీ! ప్రోమో మాత్రం బాగా వైరల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: