ప్రతి ఒక్కరి నోటా ఒకటే మాట సైరా..సైరా.. అలాంటి సినిమా లో గొప్ప పాత్ర దొరకడం నిజంగా అదృష్టమే., మెగాస్టార్ చిరంజీవి గారి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'., ఆయన కెరీర్ లో తొలిసారి చారిత్రాక నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో టాలీవుడ్, బాలివుడ్‌ లోని ఎందరో నటీనటులు భాగమయ్యారు. అందరూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. అందులో ఒక నటుడు బ్రహ్మాజీ. అయితే ఓ వైపు సైరా రికార్డుల సునామీ సృష్టిస్తుంటే బ్రహ్మాజీ మాత్రం సైరా ఫీవర్ నుంచి ఇంకా బయటకు రావడంలేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటారా..?

సైరా నరసింహా రెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేసే అవకాశం కలిపించాలని రామ్ చరణ్‌ని రిక్వెస్ట్ చేశానని గతంలోనే తెలిపాడు బ్రహ్మాజీ. అయితే ఈ సినిమాలో తాను కూడా ఊహించని విధంగా ఫుల్ లెంగ్త్ రోల్ తనకు కల్పించారని, చాలా గర్వముగా ఫీల్ అవుతున్నానని అప్పట్లో పేర్కొన్న ఆయన ప్రస్తుతం ఆ జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్నాడు.

సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించిన నటీనటులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ మీడియా వేదికగా బ్రహ్మాజీ పెడుతున్న పోస్టులు మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. గతంలో తనకు గుండు చేస్తున్నట్లుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కత్తెర పట్టుకొని నిల్చున్న పిక్ షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తున్న వీడియోతో మ్యాజిక్ చేశాడు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో బ్రహ్మాజీ రోల్ చాలా కీలకం. ఆయన పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఉయ్యాలవాడ వీరుడితో కలిసి బ్రహ్మాజీ చేసిన గుర్రపు స్వారీలు, పోరాట ఘట్టాలు సినిమాకే హైలైట్ సన్నివేశాలుగా నిలిచాయి.అలాంటి గొప్ప అవకాశం పొందడం నిజంగా తన అదృష్టం అని ఇలాంటి మరెన్నో అవకాశాలు రావాలని,ప్రతి క్యారెక్టర్ని కాపాడుకొనేలా ఇక నుంచి నటించనున్నట్లు వారు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: