ఏందిరా బాబు పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించిందంటే ఇదే కాబోలు.. రండి బాబు రండి వేడి వేడి బిగ్ బాస్ బూతులు అని అంటూ బిగ్ బాస్ రచ్చచేస్తుంది. ఎక్కడా వినని టూ... బూతులు కూడా ఎక్కడ వినపడుతున్నాయి. వీళ్ళు సెలెబ్రెటీల పోరంబోకుల అంటూ జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. గత రెండు సీజన్లు మించిన విదంగా ఈ సీజన్ రక్తి కట్టిస్తుంది. సినిమాలను చూడటం మానేసి మరి కొత్త బూతుల కోసం ఈ బిగ్ బాస్ ను కొందరు ఆదరిస్తున్నారు. 


వందరోజులు, పదహారు మంది సెలెబ్రెటీలు.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని మొదలైన బిగ్ బాస్ ప్రస్తుతం ఐదుమంది సెలెబ్రెటీలు పదిహేను రోజులు బూతులు అంటాం.. మేమింతే మేము ఇక మారం అంటూ హౌస్ మేట్స్ బూతుపురాణానికి అడ్డు ఆపులేకుండా పోయింది. దానికి తోడు బిగ్ బాస్ కూడా అంతే టాస్కుల పేరుతో చిచ్చుపెడుతున్నారు. అలాంటి బిగ్ బాస్ లో నిన్న ఎపిసోడ్ లో 85వ ఎపిసోడ్ హైలెట్ అయిందనే చెప్పాలి. 


టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్‌లో శ్రీముఖి, రాహుల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. రాహుల్‌కు లభించిన 2వ స్థానంపై శ్రీముఖి కన్నేసింది. దానికి కొద్దీ సేపు నువేందిరా నా త్యోదంతా కూడా లేవు అంటూ శ్రీముఖి చేసిన చేష్టలకు నువ్వెంత ని బతుకెంత అని రాహుల్ మాటల యుద్ధం చేశారు. మూడో స్థానానికోసం అటు వితిక, శివజ్యోతిలు నా మొగుడులేడు అంటూ ఓ రేంజులో కాలురువ్వుకొన్నారు. బిందెల కొట్లాట లా కాస్త బాగానే సాగింది..


వితిక నోరు మామూలుగానే పెద్దదని వేరేలా చెప్పనక్కర్లేదు. ప్రతి ఎపిసోడ్లో ఆమె గొంతు చాలా ఎక్కువగా వినపడుతుంది. ఇకపోతే నిన్న ఎపిసోడ్లో మూడోవ స్తానం కోసం శివజ్యోతి, వితికాలు చెంగు పైకి చిక్కుకొని నువ్వెంత ని బతుకెంత అంటూ ఒకరినొకరు మాటలతో దూషించుకుంటూ వినలేని మాటలు కూడా అన్నారు. మధ్యలో వరుణ్ కలుగ చేసుకోవడం పై మరింత జోరు పెరిగింది.   ఈరోజు ఎపిసోడ్ లో ఎలా ఉండబోతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: