తెలుగులో కొన్ని రీమేక్ సినిమాలకు సంబంధించి లాంచ్ రోజే ఒరిజినల్ సినిమా టైటిల్ చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చేస్తారు మేకర్స్. అయితే కొందరు మాత్రం రీమేక్ చేసిన సంగతి బయటికి చెప్పకుండా లోలోపలే గుసగుసలాడుతుంటారు. తీరా చూస్తే రిలీజ్ కి ముందో అయ్యాకో సోషల్ మీడియాలో జనాలు రీమేక్ అని తేల్చి చెప్పేసాక అందులో సోల్ మాత్రమే తీసుకొని తీసామంటూ కవర్ చేసుకుంటారు.
ఇక ఇటీవలే వచ్చిన చాలా సినిమాలు రీమేక్ అని చెప్పకుండా విడుదల చేసే ప్రయత్నం చేశారు.

ఇక దర్శకుడు ఓంకార్ కూడా అంతే 'రాజు గారి గది' సినిమాను హర్రర్ సినిమాల ఇన్స్పి రేషన్ తో తీసి తొలి హిట్ అందుకున్న ఓంకార్ ఆ తర్వాత మలయాళంలో తెరకెక్కిన 'ప్రేతమ్' ను 'రాజు గారి గది 2' టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసాడు. అయితే ఆ విషయాన్ని చెప్పకుండా దాచిన ఓంకార్ ఎట్టకేలకు ఆ సినిమా నుండి సోల్ తీసుకొని కథను రాసుకొన్నానంటూ తర్వాత చెప్పుకున్నాడు.


ఇక మళ్లీ ఇప్పుడు 'రాజు గారి గది 3' కి కూడా అదే రిపీట్ చేస్తున్నాడట ఓంకార్. ఈ సినిమా 'దిల్లుకు దుడ్డు 2' అనే తమిళ సినిమాకు రీమేక్ అనే టాక్ బయటికొచ్చింది. సంతానం హీరోగా తెరకెక్కిన ఫ్రాంచైజీలో మొదటి భాగం 'దమ్ముంటే సొమ్మేరా' టైటిల్ తో రిలీజ్ అయింది.

ఇప్పుడు రెండో భాగాన్ని ఓంకార్ 'రాజు గారి గది 3' గా రీమేక్ చేశాడట. మరి ఈ విషయంపై ఓంకార్ ఈసారి ఎలా స్పందిస్తాడో చూడాలి. 'రాజు గారి గది ౩' సినిమా లో అవికా గోర్ ,అశ్విన్  బాబు,అలీ,ధన్ రాజ్ తదితరులు నటిస్తున్నారు .ఈసినిమా ఈ నెల 18 తారీకు విడుదలకి సిద్ధం అవుతుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: