ప్రముఖ తమిళ నటుడు కార్తికి తెలుగులోనూ మంచి పేరు ఉంది. ‘ఆవారా’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు కూడా  బాగా కనెక్ట్ అయిపోయాడు. అప్పటినుంచి తాను తమిళంలో నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘ఖైదీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా  ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో కార్తి దిల్లీ అనే ఖైదీ పాత్రలో నటించాడు. దాదాపు పదేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న కార్తి ఒక్కసారిగా తప్పించుకుంటాడు. విలన్ చేస్తున్న అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి అతని ట్రక్కు తీసుకుని వెళ్లిపోతాడు ఈ సినిమాలో.


ట్రైలర్‌ను బట్టి చూస్తే సినిమాలో కార్తికి ఓ కూతురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ లేదు. సినిమా మొత్తం కార్తి జీవితం చుట్టూనే తిరుగుతుంది అని తెలుస్తుంది. అతన్ని పట్టుకోవాలని పోలీసులతో పాటు విలన్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ కార్తి  జైలుకి ఎందుకు వెళ్లాడు? ఆ తర్వాత ఎందుకు తప్పించుకున్నాడు? అన్నదే సినిమా కథ.


 సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టే అర్థమవుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్‌ విడుదల చేశారు. దీనికి 1.6 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. ఈ సినిమా ‘మద్రాస్’, ‘ఖాకీ’ సినిమాలలాగే ఉండబోతోందని కార్తి ఆడియో లాంచ్ వేడుకలో తెలియచేశారు. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవడంతో దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


‘చినబాబు’ లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో విజయం అందుకున్నారు కార్తి.. ఆ తర్వాత ‘దేవ్’ అంటూ రొటీన్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  అందులో ‘ఖైదీ’ ఒకటి. ‘ఖైదీ’ టైటిల్ మన తెలుగువారికి కొత్తేం కాదు. ఈ టైటిల్ వినగానే మనకు మెగాస్టార్ చిరంజీవినే గుర్తుకొస్తారు. ఆ తర్వాత ‘ఖైదీ నెం 150’ అనే సినిమాను కూడా  చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: