ఆరు పదుల వయసులో యంగ్ హీరోస్ తో పోటీ పడి చిరు గారు  సూపర్కొట్టారు. రాజమౌళి ఉంటే నే హిట్ అవుతుంది అన్న వాళ్లకు చిరు సైరా తో ఆన్సర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో సైరా కలెక్షన్ ఫిగర్ల మీద బాగా ట్రోలింగ్ జరుగుతోంది. కానీ సైరా సెకెండ్ వీకెండ్ ముగిసాక  కలెక్షన్ల ఫిగర్లు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.  ముందుగా ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్ అయ్యుందనే చెప్పాలి. ఈవారం అంతా కలిపి ప్రతి ఏరియాకు మహా అయితే మరో యాభై లక్షలు యాడ్ అయ్యే అవకాశం వుంది.


మరోపక్క సైరా తమిళ, మళయాల, కన్నడ, హిందీ వెర్షన్లు డిజాస్టర్లుగా మిగిలాయి.  ఓవర్ సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంగానే వుంది సైరా.  ఓవరాల్ గా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా నైజాం, ఉత్తరాంధ్ర, నెల్లూరు మాత్రమే ఇప్పటికి సేఫ్ మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు.  తెలంగాణలో దసరా సెలవలు పొడిగించినప్పటికీ ఏపి తో కలిపి ఈ రెండు రాష్ట్రాల్లో టోటల్ వంద కోట్లు దాటడంలేదు. 
ఈ వారం కలెక్షన్లతో దాటేసే అవకాశం వుంది. కానీ టోటల్ గా బ్రేక్ ఈవెన్ చూసుకుంటే, ఖర్చులు పోగా...... మరో ఎనిమిది కోట్ల వరకు రావాల్సి వుంటుంది. కనీసం పదిశాతం ఖర్చులు కలుపుకున్నా ఇంకో పదికోట్ల వరకు రావాలి.



ఈ నేపథ్యంలో సైరా బయ్యర్ల లాభ నష్టాలు చూసుకుంటే.....సీడెడ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. సీడెడ్ లో ఇంకా 2కోట్లు, గుంటూరులో మరో 3 కోట్లు, ఈస్ట్ లో మరో కోటిన్నర వరకు రావాల్సి ఉంది. ఇక వెస్ట్ లో ఇంకా  2కోట్లు, కృష్ణాలో కోటిన్నరకు పైగా వసూళ్లు రాబట్టినా.... ఆ షేర్ నామమాత్రం అనే చెప్పాలి.సైరా ఉత్తరాంధ్రలో మంచి ఫలితాలు నమోదు చేయడానికి కారణం అక్కడ డిస్ట్రిబ్యూటర్ క్రాంతిరెడ్డి.

 తొలివారం ఏకంగా మూడు వందల యూనిఫారమ్ రేటు, తరువాత రెండు వందల యూనిఫారమ్ రేటు తీసుకురావడంతో  ఉత్తరాంధ్రలో  కలిసి వచ్చింది. ఇక నైజాం ముఫై కోట్లు దాటినప్పటికీ ఖర్చుల్ని కలిపి ఇకపై వచ్చే షేర్ ను లెక్కించాలి. నెల్లూరు లాంటి ఏరియాలో కూడా బాగానే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపించినా....వేరే ఏరియా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. 
పైగా ఇప్పుడు సైరా యూనిట్ మొత్తం బయ్యర్ల జీఎస్టీ అంతా కట్టాలి.   అలా కట్టకుండా బయ్యర్లే కట్టుకోవాలంటే మాత్రం ఏరియాకు కనీసం కోటి రూపాయల వంతున తేడా వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: