టైటిల్‌ను లీక్ చేసిన ప్రముఖ టీవీ ఛానల్,ఫ్యాన్స్ ఆగ్రహం నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమాకు లేని సమస్య వచ్చిపడింది. ఆయన కెరీర్ లో రాబోతున్న 105వ సినిమా టైటిల్ విషయంలో ఊహించని ఎదురుబెబ్బ తగిలింది. షూటింగ్ చేస్తూనే కొన్నిరోజుల పాటు టైటిల్ సీక్రెట్‌గా ఉంచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాలని చేసిన చిత్ర యూనిట్ ప్లాన్ అంతా అప్‌సెట్ చేసేసింది ఓ టీవీ ఛానెల్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట.

 

బాలకృష్ణ 105

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టిన బాలయ్య బాబు ఆ తర్వాత కూడా తన వెండితెర ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య.. తన తదుపరి సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 105వ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలకృష్ణ డిఫెరెంట్ లుక్‌

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలకృష్ణ డిఫెరెంట్ లుక్‌లో దర్శనమీయనున్నారు. ఇప్పటికే బాలయ్యకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ లుక్‌లో బాలయ్యబాబును చూసి షాకయ్యారు ప్రేక్షకులు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శాటిలైట్ హక్కులు సొంతం చేసుకొని

నందమూరి బాలకృష్ణ 105వ సినిమా శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న జెమినీ టీవీ యాజమాన్యం.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ సినిమా టైటిల్ 'రూలర్' అని చెప్పింది. ఈ మేరకు బాలకృష్ణ- సోనాల్ చౌహాన్ పిక్ షేర్ చేశారు. దీంతో ఇలా టైటిల్ లీక్ చేయడంపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

జైసింహా హిట్ కాబట్టి..

ఈ సినిమాపై గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన `జైసింహా` సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకనిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: