ఒక మనిషి మనస్తత్వము ఏమిటో తెలియాలి అంటే వాళ్లతో కొన్నిరోజులు సావాసం చేస్తే వాళ్ళు అటువంటివారో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం వస్తున్నా సినిమాలలో కధలో పాత్రలకు తగ్గటు నటీనటులు వారివారి పాత్రలను పోషిస్తున్నారు. కొన్ని విబిన్న కథనాలతో వచ్చే చిత్రాలున్నో, అలా అన్నిటిని యువత ఆహ్వానిస్తున్నారు.

అలాంటి కథనాలతో వచ్చిన సినిమానే మన తెలుగులో విడుదల అయిన అర్జున్‌రెడ్డి, దీనిలో చదువు, ఆటల్లో తప్ప ఒక మనిషికి ఉండే సున్నితత్వం, మర్యాద, మన్నన వగైరా ఏదీ లేని వ్యక్తిని హీరోగా, హృదయ బద్ధలైన ప్రేమికుడిగా చూపించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టింది. ఇదే సినిమా హిందీలో  కబీర్‌ సింగ్‌గా అంతే విజయాన్ని మూటగట్టుకుంది. ‘తోచినట్టు’ ఉండడం.. ‘నచ్చింది’ చేయడం.. హీరోయిజంగా తెరమీద చూపిస్తే ఎంత ప్రమాదమో.. ఎంత అనర్థమో. ఇది సినిమా కాబట్టి అలాచేసారు అనే ఆలోచిన లేకుండా,  ఇటీవల ‘టిక్‌టాక్‌’ స్టార్‌ అశ్వని కుమార్‌ అలియాస్‌ ‘జానీ దాదా’ చేసిన హత్యే ఉదాహరణ.


తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే విషయం తెలిసి ఆగ్రహావేశాలతో ఆ అమ్మాయిని చంపి.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు జానీ. సినిమా చూసి తీవ్ర ప్రభావం చెందినట్టు పోలీసులు చెప్పడాన్ని బట్టి తెలుస్తోంది.  ఈ న్యూస్‌ గురించి తెలియదేమో మరి జాన్వీ కపూర్‌ ‘‘మగవాళ్లు ఎలా ఉన్నా హీరోలా చూపిస్తారు అని, మరి ఆడవాళ్లకు ఎందుకు  మర్యాద, సంప్రదాయం, ఆచారం అంటూ తట్టెడు బరువును పేడడతారు? లేడీస్‌ను కూడా లేడీ అర్జున్‌రెడ్డి, లేడీ కబీర్‌ సింగ్‌లా ఎందుకు చిత్రీకరించరు?’’ అంటూ ప్రశ్నించింది.. ‘జియో మామి ముంబై ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ’ వేదిక మీద. ‘‘బాందిని సినిమాలో నూతన్‌ పోషించిన పాత్రే అన్నిటి కన్నా బెస్ట్‌ ఫిమేల్‌ రోల్‌’ అని అన్నారు జాన్వీ కపూర్‌.


జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తొలి చిత్రం `దఢక్`తో హిట్ అందుకున్న జాన్వీ.. ప్రస్తుతం `తక్త్`, `రూహీ అఫ్జా`, `కార్గిల్ గర్ల్` చిత్రాల్లో నటిస్తున్నారు. దక్షిణాది మూలాలున్న జాన్వీకపూర్ దక్షిణాదిన సినిమాల్లో నటిస్తారని పలు వార్తలు వినిపించాయి కానీ.. అవి అంతవరకు నిజమో తెలియాల్సివుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: