ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన పేరు ముందు వరుసలో ఉంటుంది. ఛలో ద్వారా తెలుగులో ఎంట్రీతోనే హిట్ కొట్టిన భామకు అక్కడి నుంచి టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. గతేడాది విడుదలైన గీత గోవిందంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. విజయ్ దేవరకొండ – రష్మిక హిట్ పెయిర్ గా పేరు వచ్చేసింది. ఈ ఏడాది వారి కాంబినేషన్ లో వచ్చిన డియర్ కామ్రేడ్ కు అంత బజ్ క్రియేట్ కావటానికి వీరి కాంబోనే కారణం. ఇంత డిమాండ్ ఉన్న రష్మికకు ఇష్టాఇష్టాలు కూడా ఓ లెవల్ లో ఉన్నాయి.

 


ఇటివల ఓ సందర్భంలో మాట్లాడుతూ తన ఇష్టాల గురించి చెప్పుకొచ్చింది. ‘నాకు బహుమానాలు ఇస్తే నచ్చదు. వాటికి నేను పడిపోను. అమ్మాయిలు ఇష్టపడే చాక్లెట్లు, పువ్వులు ఇచ్చినా నేను ఫ్లాట్ అవ్వను. అమ్మాయిలంతా ఒకలా ఉండరు కదా. నాలాంటి వాళ్లు కూడా అక్కడక్కడా ఉంటారు. నా విషయానికి వస్తే ఎదుటివాళ్లలో నిజాయితీ చూస్తాను. అదొక గొప్ప లక్షణం. అటువంటి వ్యక్తుల్ని ఇష్టపడతాను. మిగిలిన గొప్ప గొప్ప విషయాలేం ఉండాల్సిన అవసరం లేదు. నాకు భర్తగా వచ్చే వ్యక్తిలో నేను చూసే మొదటి లక్షణం ఇదే. నాకన్నా ఎత్తు ఉండాలి.. ముఖ్యంగా నన్ను భరించే ఓపిక మరీ ఎక్కువుండాలి. రొమాంటిక్ గా ఉండాలి. నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు అయ్యుండాలి’ అంటూ తన ఇష్టాలను, కోరికలను బయటపెట్టింది.

 


 రష్మిక చిట్టా పెద్దదే అయినా మంచి ఆలోచనలే ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక మహేశ్ తో సరిలేరు నీకెవ్వరులో నటిస్తోంది. త్వరలో అల్లు అర్జున్ తో జతకట్టనుంది. నాగ చైతన్య సినిమాలో ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. తమిళ సినిమాల్లో కూడా బిజీగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: