రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా RRR సినిమా రూపొందిస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత జక్కన్న సినిమా తెరకెక్కిస్తుండటం, ఇద్దరు స్టార్ హీరోలు ిన రామ్ చరణ్ ఎన్టీఆర్, ఈ సినిమాలో నటిస్తుండటం కారణంగా ఈ సినిమాపై భారీఅంచనాలు పెంచుకున్నారు  . అందరి అంచనాలను రీచ్ అయ్యేలా ఈ సినిమాకు అన్నీతానై ముందుకెళ్తున్నారు రాజమౌళి.

.RRR సినిమా షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి, ఈ సినిమాను జులై 30, 2020 సంవత్సరంలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు జక్కన్న. అయితే అనుకోని అంతరాయం రావడంతో రాజమౌళి ఓ వారం పాటు సైడ్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.కానీ షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

అయితే అనుకోని కారణాలు, వెంటాడిన గాయాల కారణంగా ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఒకరి తర్వాత మరొకరు ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వడంతో షెడ్యూల్స్ ఆలస్యమవుతూ వచ్చాయి.ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ తమ పనుల నుంచి ఫ్రీ అయ్యారుగా అనుకునే లోపే మరో ఊహించని అడ్డు రావడం మెగా, నందమూరి అభిమానులకు షాకిచ్చింది

. ఈ సారి రాజమౌళి బ్రేక్ తీసుకోవడం, పైగా దీనికి ఆయన గత సినిమా బాహుబలి కారణం కావడం పలు చర్చలకు దారితీసింది.తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని సుప్రసిద్ధ రాయల్ ఫిల్ క్ ఆర్కెస్ట్రా టీమ్.. బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో వినిపించనున్నారు. అక్టోబర్ 19న జరగనున్న ఈ కార్యక్రమానికి రాజమౌళి సహా కీరవాణి అండ్ టీమ్ పయనమయ్యారు.తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా విడుదల కానుంది RRR మూవీ. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంఅంచనాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: