ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ .
కశ్మీర్ లోని 1990లలో కశ్మీర్ పండిట్లను ఘాజీ బాబా, కశ్మీర్ ని వదిలి వెళ్లిపోవాలని అతి దారుణంగా చంపుతాడు. అలా అతని చేతిలో అర్జున్ పండిట్ , తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోతారు. దాంతో చిన్నప్పటి నుండే అర్జున్ ఘాజీ బాబా మీద కసితోనే ఎన్.ఎస్.జి కమాండోగా అవుతాడు. ఘాజీ బాబాని రిస్క్ చేసి పట్టుకుంటాడు. ఈ క్రమంలో ఫారూఖ్ ని ఆపడానికి అర్జున్ ఏమి చేశాడు? ఘాజీని అతని గ్యాంగ్ ని ఎలా అంతం చేశాడు?
కాశ్మీర్లో జరిగిన పరిస్థితి  చాలా బాగా చూపించాడు దర్శకుడు .సాయికుమార్ ఎన్జీవో కమెండో  అర్జున్ పండిట్ పాత్రలో బాగా నటించాడు మరియు రావు రమేష్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. కీలక పాత్రలో నటించిన అబ్బూరి రవి చాలా బాగా నటించారు.తొలిసారి ఎయిర్టెల్ మోడల్ ఉషా చెట్రి ఈ సినిమాలో నటించారు .
సినిమా మొదటి భాగంలో వచ్చే కీలక సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి సస్పెన్స్ కోసం పోరాడిన లాజిక్ అస్సలు బాగాలేదు మిస్టరీ లో చాలా లోపాలు ఉండడం వల్ల సినిమా రిజల్ట్ ని చాలా దెబ్బతీశాయి. ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన ఎలివేషన్ సెకండ్ హాఫ్ లో దర్శకుడు నిలబడ లేక పోయాడు .ఇక క్లైమాక్స్ లో హీరో ఫైట్ ఉండాలని ఇరికించి  మరియు ఉంచారు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంటే సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు యాక్షన్ సీన్స్ లో అతని కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా బాగా లేవు కాని క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ చాలా బాగా తీశారు. దర్శకుడు మంచి కథ తీసుకున్న కథనం మాత్రం అస్సలు బాలేదు. మొత్తానికి ఇంటర్వెల్ లో ముందు వచ్చే సీన్స్ మరియు క్లైమాక్స్ ముందు వచ్చే ఈ సీన్స్ కొంచెం పర్వాలేదు అనిపించాయి.సెకండ్ హాఫ్ లో  వచ్చే అనవసరమైన సీన్స్ తో బాగా విసుగు తెప్పించారు ఓవరాల్  గా యాక్షన్ మూవీస్ చూసే వారికి ఈ చిత్రం కొద్ది వరకు నచ్చుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: