‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ తో పెద్ద సినిమాల నుండి చిన్నసినిమాల వరకు ఖంగారు పడుతుంటే ఈమూవీకి సంబంధించిన ఒక లేటెస్ట్ లీక్ ఇప్పుడు బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ కు ఈమూవీలోని గ్రాఫిక్స్ ప్రధాన కారణం అని అంటున్నారు. 

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాల ఎక్కువగా ఉండటంతో ఆ సీన్స్ అన్నింటినీ చాలవరకు గ్రాఫిక్ వర్క్స్ చేయించినట్లు టాక్. అయితే ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ వర్క్స్ చేసిన కంపెనీ నుండి ఫైనల్ అవుట్ పుట్ బయటకు రావడంతో ఆ అవుట్ పుట్ ను చూసి నిర్మాత సురేష్ బాబు హీరో వెంకటేష్ లు షాక్ అయినట్లు తెలుస్తోంది. 

దీనితో మళ్ళీ ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ ను మరింత బాగా చేయమని ఆపనిని చేస్తున్న గ్రాఫిక్ కంపెనీని కోరినట్లు సమాచారం. ఇప్పుడు ఆ పనికి సంబంధించిన ఫైనల్ అవుట్ పుట్ మరో వారం రోజులలో వస్తుందని అని అంటున్నారు. 

ఆ వర్క్ చూసిన తరువాత మాత్రమే ఈమూవీ రిలీజ్ డేట్ గురించి ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలని అప్పటి వరకు ఖంగారు పడటం మంచిది కాదు అన్న అభిప్రాయంలో వెంకటేష్ సురేశ్ బాబులు ఉన్నట్లు టాక్. దీనితో ఈ మూవీ ఎప్పడు విడుదల అవుతుందో తెలియక డిసెంబర్ లో రాబోతున్న చిన్న  మరియు మీడియం రేంజ్ సినిమాలు సంక్రాంతికి రాబోతున్న భారీ సినిమాలు తల పట్టుకుంటూ ‘వెంకీ మామ’ పై అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసహనం ఈమూవీ నిర్మాతల దృష్టి వరకు వెళ్ళడంతో ఎవరికీ అడ్డు లేకుండా డిసెంబర్ 13న రాబోయే వెంకటేష్ పుట్టినరోజునాడు ఈమూవీని విడుదల చేసి ఈసమస్యకు పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: