కార్తీక దీపం  ఒక భారతీయ తెలుగు బుల్లితెర ధారావాహిక, ఇది స్టార్ మాలో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతుంది మరియు హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది. ప్రెమి విశ్వనాథ్  ఈ ధారావాహికలో ప్రధాన పాత్రధారులు. ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుండి రేటింగ్స్ చార్టులో స్థిరంగా అగ్రస్థానంలో ఉంది. ముదురు రంగు చర్మం గల, స్వచ్ఛమైన హృదయపూర్వక అమ్మాయి దీపా (ప్రీమి విశ్వనాథ్) జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె నల్లటి చర్మం రంగు కారణంగా ఆమె అనేక పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొంటుంది. ఆమె డాక్టర్, కార్తీక్ (నిరుపమ్ పరితాలా) ను వివాహం చేసుకుంటుంది, ఆమె ప్రతి పరిస్థితుల్లోనూ ప్రేమ మరియు మద్దతుపై విశ్వాసం కలిగిస్తుంది.


అయితే బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపంలో మెయిన్ లీడ్ దీప కేరక్టర్ లో నటిస్తున్న నటి అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కేరళకు చెందిన ఈ భామ ఇప్పటికే మళయాలంలో మూడు సీరియల్స్ లో నటిచింది. సీరియల్స్ తో పాటు పలు రియాలిటీ షోస్ లో పాల్గొన్న ఈ భామ పలు అవార్డులు కూడా సాధించింది.


స్టార్ హీరోయిన్లకు సైతం లేని ఫాలోయింగ్ ఈ సీరియల్ కేరక్టర్లకు ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఈ సీరియల్ లీడ్ కేరక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్ నటనకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు.కార్తీక దీపం సీరియల్ అనగానే మనందరికీ గుర్తుకువచ్చే కేరక్టర్ దీప అలియాస్ వంటలక్క.తెలుగు రాష్ట్రాల్లో మహిళా ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క అనగానే అందరికీ ఎంతో అభిమానం.గత మూడేళ్లుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ గురించి అశేష ప్రజాదరణతో దూసుకెళుతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం లేని ఫాలోయింగ్ ఈ సీరియల్ కేరక్టర్లకు ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు.ఈ సీరియల్ లీడ్ కేరక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్ నటనకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవతున్నారు. కాగా తాజాగా కార్తీక దీపం దీపకు ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. 


స్టార్ మా నిర్వహించిన స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో వంటలక్క అలియాస్ దీపకు బెస్ట్ ఉమెన్ కేరక్టర్ అందుకుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.బుల్లితెరపై అతి తక్కువ సమయంలో అభిమానులను సంపాదించుకున్న కార్తీక దీపం సీరియల్ ఇంకా విశేష ఆదరణతో దూసుకెళుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: