పవన్
కళ్యాణ్ ను ఎదో విధంగా తిరిగి సినిమాలలో నటించే విధంగా ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్న నేపధ్యంలో ఒక తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడి జీవితానికి సంబంధించిన బయోపిక్ లో నటింప చేయడానికి ప్రయత్నాలు జరగడం షాకింగ్ గా మారింది. ఈ విషయాలను స్వయంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు సంచలన వార్తలకు చిరునామాగా ఉండే సంగారెడ్డి ఎమ్ ఎల్ ఏ తూర్పు
జయప్రకాష్ రెడ్డి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా తెలపడం షాకింగ్ గా మారింది.
జగ్గారెడ్డి అంటూ సుపరిచితమైనా ఈ రాజకీయ నాయకుడి జీవితంలో ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు ఉన్నాయని ఆ విషయాలు అన్నీ అందరికీ తెలియ వలసి ఉన్న నేపధ్యంలో తన బయోపిక్ ను తానే నిర్మిస్తానని జగ్గారెడ్డి లీకులు ఇస్తున్నాడు. ప్రస్తుతం
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో చాల ఉత్సాహ వంతంగా పాల్గొన్న విషయం తెలిసిందే.
పవన్
కళ్యాణ్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న జగ్గారెడ్డి అప్పుడప్పుడు పవన్ ను కలిసి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాడని ఒక ప్రచారం కూడ ఉంది. ఫైర్‌బ్రాండ్ నేతగా సుపరిచితుడు అయిన జగ్గారెడ్డి ఒకప్పుడు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు ఆయన పై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నాడు.
వాస్తవానికి
పవన్ సినిమాలలో నటించేలా ఒప్పించడానికి
క్రిష్ హరీష్
శంకర్ దిల్
రాజ్ లు లాంటి ఎందరో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు పవన్ పై ఒత్తిడి చేస్తున్నా
పవన్ స్పందించడం లేదు. అలాంటి
పవన్ కేవలం తనకు పరిచయం ఉన్న కారణంతో జగ్గారెడ్డి బయోపిక్ లో నటిస్తాడు అని భావించడం వాస్తవం కాకపోయినా జగ్గారెడ్డి
పవన్ పై పెట్టుకున్న ఆశలు మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం..