నయనతార నా ఫేవరెట్.తనే నా  డార్లింగ్ అంటూ అగ్ర దర్శకుడు.. చెప్పిన మాటల్ని విన్న విఘ్నేష్ శివన్‌కు షాక్ ఇచ్చాయి.అవును.. నమ్మశక్యం గా లేకపోయినా ఇది నిజం.. కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ప్రస్తుతం ఉన్న ఓ కుర్ర దర్శకుడు నయనతారను  ఏకంగా తన డార్లింగ్ అనేసాడు. అందులోనూ వరస విజయాలతో దూసుకుపోతున్న ఆ యువ డైరెక్టర్.

అందులోనూ వరస విజయాలతో దూసుకుపోతున్న ఆ దర్శకుడు అంత మాట అనేయడంతో నిజంగానే విన్న అక్కడున్న సభ్యులంతా ఒక్కసారిగా  షాక్  అయ్యారు. నయనతార అంటే కేరాఫ్ తమిళ్ సినిమా ఒక్కటే కాదు.. సౌత్ సినిమా. అన్ని ఇండస్ట్రీలలో వరస సినిమాలు చేస్తూ ,విజయాలు అందుకుంటూ సంచలనాలు రేపుతుంది నటి నయన్. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో సినిమాకు కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటూ దూసుకెళ్లిపోతుంది ఈ అందాల భామ.

నయన తార  ప్రొఫెషనల్ లైఫ్,అలానే  వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తూనే ఉంటుంది మీడియా లో . ఇప్పుడు కూడా ఇలానే జరిగింది. నయనతార కేరాఫ్ విఘ్నేష్ శివన్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసినవిషయమే. ఈ ఇద్దరూ ఒకరి ప్రేమలో  ఒకరు ఉన్నారు. త్వరలోనే పెళ్లి పీటలు  కూడా ఎక్కనున్నారు  అని వార్తలు కూడా వచ్చాయి.అయితే ఇప్పుడు అట్లీ కుమార్ ,నయనతార నా డార్లింగ్ అంటూ సడన్ గా చెప్పే సరికి, అందులో మరో అర్థం లేకపోయినా,ఆమెతో ఉన్న స్నేహాన్ని అలా బయటికి చెప్పేసరికి అంతా ఒక్కసారి షాక్ అయిపోయారు. అట్లీ తొలి సినిమా రాజా రాణిలో నయనతారే హీరోయిన్,పైగా ఈ మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో చెప్పకర్లేదు ప్రత్యేకంగా.

ఆర్య, జై హీరోలైనా కూడా నయన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాతోనే అట్లీ సంచలనాలకు కేర్ ఆఫ్  అడ్రస్ గా మారారు.ఆ తర్వాత తెరీ, మెర్సల్ సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకున్నారు. ఇప్పుడు బిగిల్ సినిమాతో వస్తున్నాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. తెలుగు ప్రెస్ మీట్‌లో నయన్ గురించి మాట్లాడుతూ తను నా  స్వీట్ డార్లింగ్ అనేసాడరు  అట్లీ. ఆమె లేకపోతే రాజా రాణి సినిమా లేదంటూ చెప్పేసారు . మొత్తానికి నయన్ నా డార్లింగ్ అంటూ అట్లీ చెప్పడం మాత్రం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది అందరికి.


మరింత సమాచారం తెలుసుకోండి: