ఒకప్పుడు పవన్ కేరియర్ తెలిరోజులలో విడుదల అయిన సుస్వాగతం సినిమా ఆరోజులలో మంచి సూపర్ హిట్. ఆ మధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు నచ్చిన సినిమాలలో ‘సుస్వాగతం’ సినిమా కూడా ఒకటి అంటూ మాట్లాడాడు పవన్. ఈ సినిమా తరువాత ఇదే దర్శకుడు ‘అన్నవరం’ లాంటి ఫ్లాపును పవన్ కు ఇచ్చాడు. ఇది గతం  ఈ సినిమాల తరువాత పవన్ లేటెస్ట్ విజయాలతో టాలీవుడ్ ఎంపరర్ గా మారిపోయాడు. ఆ తరువాత దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు చాలా కాలం కనుమరుగు అయ్యాడు అని భావిస్తున్న తరుణంలో అనుకోకుండా సుడిగాడు సినిమా ద్వారా మళ్ళి వెలుగు లోకి వచ్చాడు. ఆ తరువాత తమిళంలో కూడా మరోహిట్ అందుకున్నాడు.  ఈ నేపధ్యం లో భీమినేని ఇటీవల పవన్ కు సూటయ్యే ఓ సినిమాను కనిపెట్టి, కొనిపెట్టి వుంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య రెండు హిట్ లు కొట్టాను కనుక ఈ సబ్జక్ట్ తీసేందుకు అవకాశం ఇవ్వమని పవన్ ను అడగాలన్నది భీమినేని మాస్టర్ ప్లాన్ అట. కానీ ఇప్పటి పరిస్థితులలో పవన్ భీమినేని కోరిక తీరుస్తడా అన్నదే అందరి దృష్టిలో ప్రశ్న  కానీ పవన్ కు ఒక విచిత్రమైన అలవాటు ఉంది అంటారు. ఎప్పుడో తనతో నటించిన ముంతాజ్ ను పిలిచి పవన్ తన ‘అత్తారిల్లు’ సినిమాలో త్రివిక్రమ్ తో చెప్పి అవకాశo ఇప్పించాడు అని చాలామంది అంటారు. అందువల్ల భీమినేనికి సుడి తిరిగితే పవన్ కరుణించినా కరుణిస్తాడు అంటూ వార్తలు విన పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: