తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న కేంద్ర ప్రభుత్వ ‘పద్మ’ అవార్డుల పై విలక్షణ నటుడు బాలీవుడ్ యాక్టర్ నానా పాటేకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారత రత్న లభించకపోవడంపై బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒకవేళ క్రీడాకారుడికి భారత రత్న ప్రకటిస్తే ముందు ధ్యాన్ చంద్ కు మాత్రమే ఇవ్వాలని నానా అభిప్రాయపడ్డారు  గుర్గావ్ సమీపంలోని కదార్ పూర్ లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ప్రారంభమైన జీవీ మాల్వంకర్ ఓపెన్ నేషనల్ షూటింగ్ చాంఫియన్ షిప్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన 'భారత రత్నకు మేజర్ ధ్యాన్ చంద్ అర్హుడు అని అన్నారు.  ప్రస్తుత కాలంలో ఆటగాళ్లు డబ్బు కోసమే ఆడుతున్నారని దేశం కోసం ఆడటం లేదని నానా ఆరోపించారు. అదేవిధంగా తనకు పద్మ శ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదని ఆయన ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. బాలీవుడ్ లో డబ్బు కోసమే పనిచేశాను కాని సమాజ సేవ చేయలేదు అని ఆయన అన్నారు.  ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డులు ఒక ప్రహసనంగా తయారు అయ్యాయని సమాజంలో నిజమైన సేవ చేసేవారిని గుర్తించ కుండా కేవలం సెలెబ్రెటీలనే గుర్తిస్తూ వారికి మాత్రమే పద్మ అవార్డులు ఇవ్వడం దురదృష్టకరం అని నానా పాటేకర్ అభిప్రాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: