ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆయన కొడుకు యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాల మధ్య సఖ్యత కొరవడిందన్న ప్రచారం కోలీవుడ్ లో విపరీతంగా జరగుతోంది. దీనికి కారణం సాంప్రదాయ వాదిగా పేరున్న ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్‌రాజా మత మార్పిడికి పాల్పడటమేనని అని అంటున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా మంచి స్థాయిలో ఉన్నా ఆయన వైవాహిక జీవితం మాత్రం సమస్యల మయంగా మారి కోలీవుడ్ లో అనేక గాసిప్స్ కు తావు ఇస్తోంది. ఇప్పటికే యువన్ చేసుకున్న రెండు పెళ్లిళ్లు విడాకులకు దారి తీయడంతో తన కుమారుడి ప్రవర్తనతో ఇళయరాజాకు ఈ మధ్య ఆరోగ్యం కూడా దెబ్బతింది అనే టాక్ ఉంది. దీనికి తోడు యువన్ శంకర్ రాజా ఈ మధ్యనే ఇస్లాం మతాన్ని స్వీకరించి మరింత సంచలనంగా మారాడు. అయితే ఈ మత మార్పిడి ఇళయ రాజాకు ఇష్టంలేదని ఈ విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని యువన్ శంకర్ రాజా ఖండించారు. ఈ వ్యవహారం పై ఆయన స్పందిస్తూ తాను ఇస్లాం మతం స్వీకరించిన విషయం నిజమేనన్నారు. ఈ విషయాన్ని తాను గొప్పగా భావిస్తున్నానని ఈ విషయంలో తన కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా నిలిచారని చెప్పాడు. అంతే కాదు తన తండ్రి ఇళయరాజాకు తనకు మద్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్ కూడా పెట్టాడు.  యువన్ శంకర్ రాజాకు తన తల్లి అంటే ఎనలేని ప్రేమ అని ఆమె మరణం అతడిని క్రుంగ దీసిం దని అంటున్నారు. అయితే యువన్ ఎ.ఆర్.రెహ్మాన్‌ను అనుసరిస్తున్నాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: