సామాన్యంగా విడుదలకు ముందు పెద్ద సినిమాలకు సంబంధించిన డైలాగ్స్, సీన్స్, పాటలు వెబ్ మీడియాలో లీక్ అవుతూ సంచలనం సృష్టిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని చాల సీరియస్ గా తీసుకుని మన నిర్మాతలు గగ్గోలు పెడుతూ ఉంటారు. తెలుగు సినిమా దర్శకులలో అభిరుచి ఉన్న దర్శకుడిగా శేఖర్ కమ్ముల తన ‘అనామిక’ సినిమా పబ్లిసిటీకి సంబందించి ఒక కొత్త పద్దతిని సృష్టించి నిన్న రాత్రి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రేమ కథల నుండి రాజకీయ సినిమాల వరకు తనదైన బాణిలో సినిమాలు తీయడం శేఖర్ కమ్ములకు వెన్నతో పెట్టిన విధ్య. నిజానికి శేఖర్ కమ్ముల లాంటి వైవిధ్యమైన అభిరుచి ఉన్న దర్శకులు రీమేక్ సినిమాలు చేయవలసిన అవసరం లేదు. కానీ శేఖర్ ఇప్పుడు ఓ ప్రయోగానికి సిద్దమయ్యాడు.  వివరాలలోకి వెళితే తాను రూపొందించి ఈ రోజు విడుదల అవుతున్న 'అనామిక' చిత్రాన్ని నిన్న రాత్రి ముందుగా ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం చేసి సంచలనం సృస్టించాడు. అయితే ఆ సినిమాలోని ఒక రీలును పూర్తిగా ప్రసారం చేసి మరో కొత్త పబ్లిసిటీకి శ్రీకారం చుట్టాడు శేఖర్. కేవలం సినిమాలోని ఒక్క రీలే అయినా అది మామూలు విషయం కాదు. సినిమాలోని ఓ డైలాగు లీకైతేనే తెగ ఖంగారు పడిపోయే మన దర్శకులకు శేఖర్ కమ్ముల ఓ సవాల్ విసిరారు.  నిన్న రాత్రి టీవీ9లో రాత్రి 10 గంటలకు ప్రసారం అయిన ‘అనామిక’ మొదటి రీలును చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. శేఖర్ క్రియేటివిటీకి దర్పణంగా ఉన్న ఈ సినిమా మొదటి రీలు టేకింగ్ చూసాక అనామిక సినిమా పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఏమైనా శేఖర్ కమ్ముల ధైర్యాన్ని మెచ్చుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: