ఈమధ్య మన టాప్ హీరోలకు వేదాంత ధోరణి మరీ ఎక్కువైపోతున్నట్లుగా అనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ‘గోపాల గోపాల’ ఆడియో వేడుకలో జీవితం పై విరక్తికలిగి ఒకప్పుడు శ్రీశైలం అడవులలోకి వెళ్లిపోదామని అనుకున్నానని చెప్పిన పవన్ మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే ఈమధ్యనే తాను కూడా ఒకప్పుడు సన్యాసిగా మారిపోదామని అనుకున్నానని విక్టరీ వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.  తనకు ఒకదశలో ఈ స్టార్డమ్ కు దూరంగా వెళ్ళిపోయి నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఒక సన్యాసిలా మారిపోవాలని గతంలో తనకు ఒకసారి అనిపిమచిందని వెంకటేష్ ఆశ్చర్య కామెంట్లు చేసాడు. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న పవన్ వెంకటేష్ లు ‘గోపాల గోపాల’ సినిమాలో నటించిన తరువాత గతంలో తమకు  స్పురించి వారు మర్చిపోయిన ఆధ్యాత్మిక విషయాలను ఇప్పుడు గుర్తుకు చేసేలా ‘గోపాల గోపాల’ సినిమా వారి పై ప్రభావం చూపెట్టిoదా? లేదంటే వారి ఆధ్యాత్మిక ఉద్దేశాలను ఇలా అన్యాపదేశంగా తమ అభిమానులకు తెలియ చేస్తున్నారా అనే విషయం పై క్లారిటీ లేకపోయినా ఈ టాప్ హీరోలు ఇరువురి పై గోపాలుడు గట్టి ప్రభావాన్ని చూపెట్టాడు అనుకోవాలి.  పవన్ వెంకటేష్ ల ఆధ్యాత్మిక అభిప్రాయాలకు అభిరుచులకు అనుగుణంగా నిర్మించిన ‘గోపాల గోపాల’ అనుకున్నట్లుగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే ఆ సినిమా ప్రభావంతో పవన్, వెంకటేష్ ల అభిమానుల ఆలోచనా సరళిలో కూడా మార్పులు వచ్చి వారు కూడా రాబోతున్న రోజులలో ఆధ్యాత్మిక బాట పడతారేమో చూడాలి..         

మరింత సమాచారం తెలుసుకోండి: