క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండుల్కర్ ఒక స్టార్. చిన్నతనంలోనే క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటాడు. భారత దేశంలో ఒక నానుడి ఉంది క్రికెట్ ఒక దేవాలయం అయితే అందులో దేవుడు సచిన్ టెండుల్కర్. అంత గొప్ప పేరు సంపాదించుకున్న ఈ ఆటగాడు ప్రస్తుతం రిటైర్ మెంట్ తీసుకున్నాడు. కానీ క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. అంతే కాదు సచిన్ టెండుల్కర మానవతా వాది చాలా సాదాసీదాగా ఉండాలని కోరుకునే వ్యక్తత్వం ఉన్నవాడు. అదే విధంగా తన పిల్లల్ని కూడా పెంచాడు.


తండ్రి సచిన్ టెండుల్కర్ , తల్లి అంజలితో, తమ్ముడు అర్జున్ తో సారా టెండుల్కర్ 


కొడుకు అర్జున్ తన ఇష్టానుసారుంగానే పెరిగాడు ఏనాడూ తనపై ఆంక్షలు విధించలేదు అని ఒక టీవీ ఇంటర్వూలో చెప్పాడు. సచిన్ కూతు సారా టెండుల్కర్ గురించి సరికొత్త వార్త బాలీవుడ్ లో వినిపిస్తుంది.  అదే  సినీ రంగంలోకి ఆరంగేట్రం చేస్తున్నారా? అంటే కావొచ్చుననే చెప్పవచ్చు. సారా టెండుల్కర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సచిన్ కూతురు సారా టెండుల్కర్ వయస్సు 18. ఆమె త్వరలో బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేయబోతుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.  ప్రముఖ నటుడు షాహిద్ కపూర్ సరసన నటించనుందని రూమర్స్ వస్తున్నాయి. 


తండ్రి విక్టరీని ఆనందిస్తూన్న సారా టెండుల్కర్


సాధారణంగా సచిన్ తన కూతురుతో  పలు సందర్భాల్లో  ఈవెంట్లకు, క్రికెట్ మ్యాచులకు హాజరవుతారు. ఆ సమయంలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండేవారు. ఆమె తండ్రి సచిన్‌తో, తల్లి అంజలితో పలు కార్యక్రమాల్లో పాల్గొనేది. ప్రస్తుతం సారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మరి ఈ అమ్మడు గ్లామర్ రోల్స్ లో కనిపిస్తుందా లేక సాదా సీదా గా కనిపిస్తుందా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సారా గనక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే క్రికెట్లో సచిన్‌ను ఆదరించినట్లే, సినిమాల్లో  ఆదరిస్తారు అని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: