తెలుగు చిత్ర సీమంలో మకుటం లేని మహరాజులా వెలిగిపోయిన మెగాస్టార్ ఏడేళ్ల క్రితం రాజకీయ రంగంలోకి వెళ్లారు. ఇక చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ అప్పట్లో మామూలు స్టార్ గా ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాన్ మంచి ఫామ్ లోకి వచ్చారు. ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతే కాదు పవన్ కళ్యాన్ రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు సొంతగా ఓ పార్టీ స్థాపించారు అదే జనసేన. ఇక ఈ పార్టీ పెట్టినపుడు ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించింది. దీంతో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే సమంలో పవన్ కళ్యాన్ ఒక నినాదం తీసుకు వచ్చారు. ‘కాంగ్రెస్ కో హటావో..దేశ్ కో బచావో ’ ఈ నినాదంతో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,టీడీపీలకు మద్దతు ఇచ్చాడు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపి ఘన విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు.

చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నా కూడా సొంత తమ్ముడు పార్టీ పట్ల వ్యతిరేకతను అడ్డుకోలేక పోయేరే అన్న విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి అన్నదమ్ములు కాస్త దూరంగానే ఉన్నారు. ఈ మద్య ఓ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తనకు రెండు కళ్ల వంటి వారని చెప్తున్నారు. రాజకీయాలు, సినిమాలు వేర్వేరని.. వాటికి కుటుంబ సబంధాలకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. కుటుంబ సంబంధాలను దూరం చేసుకోమని.. ఏదో ఒక సందర్భంలో అందరం కలుస్తుంటామని చిరంజీవి అన్నారు. అలా కలిసిన సందర్భాల్లో రాజకీయాల గురించి చర్చ తమ మధ్య రాబోదని చిరంజీవి అన్నారు.

మెగా బ్రదర్స్ చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాన్


పవన్ పాలిటిక్స్ డిఫరెంట్ అని అవన్నీ ఇంటికి బయటే వదిలిపెట్టి వచ్చేస్తాడని చిరంజీవి చెప్పారు. మెగాస్టార్ 60వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్, ఆమీర్ ఖాన్‌లు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరితోపాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను చిరు తనయుడు ఆహ్వానించారు. ఈ బర్త్‌డే పార్టీకి పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉందని మెగా సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ప్రతి యేటా ఆగస్ట్ 22 చిరు బర్త్ డేను పెద్ద పండుగలా జరుపుకునే మెగా అభిమానులకు ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకంగా మారనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: