సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ సమయాల్లో గాయాలు కావడం సహజం.. కొన్ని యాక్షన్ సీన్లలో హీరోలు అప్పుడప్పుడు గాయాలు పాలు అవుతుంటారు. తాజాగా ఒక కన్నడ నటికి ఫైట్ మాస్టర్ పుణ్యమా అని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కన్నడ నటీమణి రాగిణి ద్విదేది కొత్త సినిమా ‘నానే నెక్స్ట్ సీఎం’లో నటిస్తుంది. ఈ సందర్భంగా మైసూరు సమీపంలో   కొన్ని యాక్షన్ సీన్లో పాల్గొనవలసి ఉండగా ఫైట్ మాస్టర్ ఫైట్ సీన్ కంపోజ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో ఆమెపై హాకీ స్టిక్  ఆమెపై విసిరివేసే సన్నివేశం తీస్తున్నారు వాస్తవానికి ఆ సమయంలో ఆమె తప్పించుకోవాల్సిన సన్నివేశం కానీ అనుకోకుండా ఆ హాకీ స్టిక్ ఆమె తలపై బలంగా తాకడంతో తలకు తీవ్ర గాయం అయ్యింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయింది. వెంటనే తెరుకున్న యూనిట్ సభ్యులు ఆమెను హాస్పిటల్ కు తరలించి వైద్యం చేయించారు. 

ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఇలాంటి సన్నివేశాల్లో సాధారణంగా డూప్ ఉపయోగిస్తారు కానీ ఈ సన్నివేశంలో ఆమెనేరుగా పాల్గొనడంతో ప్రమాదం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: