నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ సినిమా ప్రారంభం 2017 వరకు లేకపోయినా అప్పుడే ఈ నందమూరి సింహం వారసుడు సినిమా పై వార్తల హడివితోమీడియా హోరెత్తి పోతోంది.  దీనికి కొనసాగిoపుగా మరో లేటెస్ట్ న్యూస్ మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ ఒకవైపు తన 100వ సినిమా విషయమై దృష్టి పెడుతూనే తన కొడుకు మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన సూచనలను కధలను చాలా సీరియస్ గా వింటున్నట్లు టాక్. 

ఈ నేపధ్యంలో ఈ విషయమై మరో లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. నందమూరి తారకరామారావు కెరియర్ కు సంబంధించి తోలి బ్లాక్ బస్టర్ హిట్  మరియు క్లాసిక్ మూవీగా పేరుగాంచిన ‘పాతాళ భైరవి’ ని తిరిగి మోక్షజ్ఞ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రీమేక్ చేస్తే మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి ఎదురు ఉండదు అని బాలయ్య సన్నిహితులు అయన దగ్గర సూచిస్తున్నట్లు టాక్. 

1951లో విడుదల అయిన ‘పాతాళ భైరవి’ తెలుగు సినిమాల చరిత్రలో ఒక క్లాసిక్. ఒక జానపద సినిమా క్లాసిక్ గా మారడమే కాకుండా నందమూరి తారకరామారావుకు స్టార్ డమ్ తీసుకువచ్చిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాను నేటి లేటెస్ట్ గ్రాఫిక్స్ మాయతో తిరిగి నిర్మిస్తే మొదటి సినిమాతోనే 100 కోట్ల హీరోగా మోక్షజ్ఞ మారిపోతాడు అంటూ కొందరు బాలకృష్ణకు సూచనలు ఇస్తున్నట్లు టాక్. 

అయితే టాప్ హీరోలతో తప్పించి కొత్త హీరోలతో సినిమాలు తీయడానికి పెద్దగా ఇష్టపడని రాజమౌళిని ఈ విషయంలో ఎలా ఒప్పించాలి అన్న విషయo పై బాలకృష్ణ తీవ్రంగా ఆలోచినట్లు టాక్. మరి బాలయ్య ఎత్తుగడలకు రాజమౌళి ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: