తెలుగు ఇండస్ట్రీలో చలాకీ హీరోగా మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ అందికీ బాగా తెలుసు..  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. సినిమా ఇండస్ట్రీలో  రాక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మనోజ్ ఒక నటుడిగానే కాకుండా పాటలు పాడటం, కొన్ని ఫైటి సీన్స్ తనే కంపోజ్ చేయడం..మ్యూజిక్ లో కూడా చొరవచూపడం ఆల్ ఇన్ వన్ టైప్ లో దూసుకు వెళ్తాడు.. అయితే కొన్ని రోజులుగా మంచు హీరో మనోజ్ కనిపించకపోవడం తో పెళ్లి తర్వాత అజ్ఞాతం లోకి వెళ్ళాడని వార్తలొచ్చాయి .

షాకింగ్ లుక్ తో మనోజ్ కనిపించిన ఈ హీరో లేటెస్ట్ ఫోటోలను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ వెబ్ మీడియాలో బయట పెట్టాడు. మనోజ్ ప్రస్తుతం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు గాంచిన దశరథ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఇలా లేటెస్ట్ లుక్ తో దర్శనమివ్వబోతున్నాడు.  అయితే  2010లో మంచు మనోజ్, వీరూ పోట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘బిందాస్’ సినిమా మనోజ్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మంచు మనోజ్ వీరూ పోట్లతో కలిసి ‘బిందాస్ 2′ చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలిసింది. డైరెక్టర్ వీరూ పోట్ల కూడా ఈ సినిమా చెయ్యడానికి సిధ్ధంగా ఉన్నాడట.

బిందాస్ చిత్రంలో ఓ దృశ్యం


‘బిందాస్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘బిందాస్ 2′ మూవీకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు.‘బిందాస్ 2′ మూవీ ప్రారంభమైతే ఆ షూటింగ్‌లో కూడా పాల్గొంటాడట. డైరెక్టర్ వీరూ పోట్ల మంచు విష్ణుతో తీసిన ‘దూసుకెళ్తా’ సినిమా సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మళ్లీ సీక్వెల్ గా రాబోతుందన్నమాట.  ప్రస్తుతం మనోజ్ దశరథ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా తర్వాత మనోజ్ మరో ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు సో ఈ సినిమా అయ్యేలోపు బిందాస్ 2 గురించి డెసిషన్ తీసుకుంటారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: