ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది..అయితే ఈ అభివృద్ది మానవాళికి మంచి జరిగితే చాలా బాగుంటుంది. కానీ ఈ టెక్నాలజీ కొంతమంది అసాంఘిక శక్తులు ప్రజా వినాశనాన్ని కాంక్షిస్తూ అమాయ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఐఫోన్‌ను కలిగిన ఉన్న ఓ ఉగ్రవాది సృష్టించిన అరాచికం టెక్నాలజీ దిగ్గజం యాపిల్, అమెరికా దర్యాప్తు సంస్ధ ఎఫ్‌బీఐ మధ్య చిచ్చు రేపింది. అసలు విషయానికి వస్తే...గత ఏడాది అమెరికా కాలిఫోర్నియా శాన్‌బెర్నార్డినోలో సయద్‌ రిజ్వాన్‌ ఫరూఖ్‌ అనే ఐఎస్‌ ఉగ్రవాది విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడి 14 మంది ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే.

తర్వాత రిజ్వాన్‌ వ్యక్తిగత ఐఫోన్‌ను ఎఫ్‌బీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాది దానిని అన్‌లాక్‌ చేసి ఇవ్వాలని యాపిల్‌ సంస్థను కోరారు. నిందితుడి ఐఫోన్‌లోని సమాచారాన్ని పొందేందుకు దానిని తెరిచే మాల్‌వేర్‌ తయారు చేయాలంటూ ఎఫ్‌బీఐ ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే అందుకు యాపిల్ మాత్రం విముఖతను వ్యక్తం చేసింది. ఇక దీనిపై  అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న  డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శాన్ బెర్నార్డినో షూటర్ల ఐఫోన్ డేటాను సేకరించేందుకు ఎఫ్‌బీఐకి సహకరించేవరకు ఆ సంస్థ ఉత్పత్తులను బహిష్కరించాలన్నారు.  సౌత్ కరోలినా ప్రైమరీ జరిగేందుకు ఒకరోజు ముందు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. యాపిల్ కంపెనీ తమ ఫోన్లకు భద్రత కల్పించడం వరకు ఓకేనని, అయితే ఆ సెక్యూరిటీ నెంబరును నిఘా సంస్థలకు ఇవ్వాల్సిందేనని, అలా ఇవ్వనంత కాలం ఆ సంస్థను బహిష్కరించాలని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: