చేపలు మంచి ఆహారం.. మాంసం కంటే చేపలు తినమని వైద్యులు కూడా సూచిస్తారు. కానీ.. అమెరికా వాసులు మాత్రం ఓ చేప పేరు చెబితే వణికిపోతున్నారు. చేప ఎక్కడైనా మీకు చెరువుల్లో కనిపిస్తే మాకు చెప్పండి అంటూ ప్రభుత్వ అధికారులు బోర్డులు పెడుతున్నారు. ప్రకటనలు ఇస్తున్నారు. మరి ఈ చేప ఎందుకు అంతగా అమెరికా వాళ్లను భయపెడుతోంది..?

 

అలాగని అది విషాహారం కాదు.. చేప రుచి కూడా అదిరిపోతుంది. మరి ఎదుకంత భయం తెలుసా..? ఎందుకంటే.. చేప ఆహారంగా నీటిలో ఉంటే ఇతర జీవులను తింటుంది. అంతే కాదు..విపరీతంగా గుడ్లు పెడుతుంది. సంతానం భారీగా పెరుగుతుంది. అయితే ఇంకా మంచిదేగా అంటారా.. కానీ వీటి కారణంగా ఇక చెరువులు, జలాశయాల్లో మిగిలిన జంతువులు బతకవు.

 

అందువల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బ తింటుందట. ఇది ప్రకృతికే ప్రమాదమట. అందుకే ఈ చేపను అమెరికాలో నిషేధించారు. ఇది క్రమంగా అమెరికా మంచినీటి సరస్సుల్లో చేరితే పెను ప్రమాదం ఉంటుందని భయపడుతున్నారు. దీని వ్యాప్తి అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: