ఒక దేశ రహస్య సమాచం మరో దేశానికి చేరవేస్తే అది పెద్ద నేరం అవుతుంది..ఇలాంటి సమాచారం అందించిన వ్యక్తులను ఆ దేశం కఠిన శిక్ష విదించడం లేదా మరణ శిక్ష విధించడం జరుగుతుంది. ముఖ్యంగా సౌదీ దేశాల్లో అయితే ఇలాంటి శిక్షలు వెంటనే అమలు చేస్తుంటారు. తాజాగా అమెరికాకు తమ దేశ  అణుకార్య‌క్ర‌మానికి సంబంధించిన అతి కీలకమైన రహస్య సమాచారం అందించారని ఆరోపిస్తూ ఇరాన్ దేశం  శారాం అమిరి అనే అణుశాస్త్ర‌వేత్త‌ను ఉరితీసింది. ఆ తర్వత  మృతదేహాన్ని అమిరి ఇంటికి పంపింది.  ఇక 2009లో ప‌విత్ర మ‌క్కామ‌సీదుకు వెళుతున్నాన‌ని చెప్పిన అమిరి ఆ త‌ర్వాత కొంత కాలంగా కనిపించకుండా పోవడం జరిగింది.

అయితే ఒకానోక సమయంలో అమెరికా తీసిన ఓ వీడియోలో అమిరి క‌నిపించ‌డంతో ఇరాన్ అధికారులు అల‌ర్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనపై నిఘా పెంచారు. తర్వాత అమెరికాలోని పాకిస్తాన్ ఎంబ‌సీ ద్వారా ఇరాన్‌కు చేరుకున్న అమిరిని ఇరాన్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అమిరి చెప్పిన విషయాల ప్రకారం అరేబియాలో అమెరికా అధికారులు త‌న‌ను కిడ్నాప్ చేశార‌ని..ఇరాన్‌కు సంబంధించిన అణుకార్య‌క్ర‌మంపై స‌మాచారం ఇవ్వాల్సిందిగా బెదిరించార‌ని చెప్పాడు.

తనను రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్లి చిత్ర హింసలకు గురి చేసినట్లు అమిరీ ఇరాన్ అధికారులక తెల్పినప్పటికీ వరు నమ్మలేదు. 5 మిలియ‌న్ డాల‌ర్ల‌కు ఆశ‌ప‌డి న్ల్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి కీల‌క స‌మాచారాన్ని శ‌తృదేశానికి చేర‌వేశాడ‌ని ఇరాన్ ఆరోపించింది..అయితే అమిరిని ఉరి తీసినట్లు  ఇరాన్ అధికారులు ధృవీక‌రించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: