ప్రపంచ కుబేరుడుగా పేరొందిన, అమెజాన్ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌కి భారత సంతతి మహిళ షాక్ ఇచ్చింది. ఆమె అడిగిన ప్రశ్నకి అతడి దగ్గర సమాధానం లేకపోవడంతో జెఫ్ కి ఎలాంటి  రెప్లై ఇవ్వాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. ఆమె దూకుడు చూసిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెని అక్కడి నుంచీ బయటకి తీసుకువెళ్ళి పోయారు. ఇంతకీ జెఫ్ కే దిమ్మతిరిగేలా ఆమె సంధించిన ప్రశ్నలు ఏమిటి, అసలు అక్కడ ఏమి జరిగింది అనే వివరాలలోకి వెళ్తే.

 Related image

భారతీయులకి ధైర్య సాహసాలు ఎక్కువ. ఎటువంటి విషయంలో అయినా సరే దూకుడుగా ఉండటం భారతీయులకి పెట్టింది పేరు. అదేవిధంగా ఆలోచనా పరులు, సెంటిమెంట్ జనాలు అనే పేర్లు కూడా ఉన్నాయి. అమెరికాలో జంతు హక్కుల పై పోరాటం చేసే సంస్థలో వాలంటీర్ గా పని చేస్తున్న భారత సంతతి మహిళ అయిన ప్రియా సాహ్నే  అమెజాన్ అధినేత జెఫ్‌ హాజరయిన రీ మార్స్ అనే చర్చా కార్యక్రమానికి వెళ్లి అక్కడ పాల్గొన్నారు.

 Image result for indian-american-activist-who-shouted-at-jeff-bezos-arrested

ఈ కార్యక్రమంలో చర్చలు ఎంతో సరదాగా జరుగుతున్న సమయలో ఒక్క సారిగా ప్రియా అనే మహిళ స్టేజి మీదకి వచ్చేసింది.చర్చని మధ్యలో ఆపమని చెప్పి జెఫ్ కి సూటిగా ప్రశ్నలు సంధించింది. అమెజాన్ సంస్థ కి అధ్యక్షుడిగా ఉన్న మీరు మూగ జీవాలా కోసం ఏదన్నా చేయాలి కదా అంటూ గట్టిగా ప్రశ్నించింది. అంతేకాదు  మీ ఆధ్వర్యంలో నడుస్తున్న కోళ్ళ ఫారాల్లో జంతు హింస అత్యంత దారుణంగా ఉంటోంది. మరి ఈ విషయానికి మీరు ఎలాంటి బదులు ఇస్తారు అంటూ ప్రశ్నించింది. ఆమె అడిగిన ప్రశ్నలకి బిత్తరపోయిన జెఫ్ ఆమెకి సమాధానం చెప్పలేదు.  ఈలోగా అక్కడి సెక్యూరిటీ వాళ్ళు ఆమెని అక్కడి నుంచీ బయటకి తీసుకు వెళ్ళిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: