పెళ్లి చేసుకోవడానికి అందమైన అమ్మాయి కోసం పెళ్లి కాని ఎన్నారైలు వెతుకుతూ ఉంటారు. అలాంటి వారిని బుట్టలో వేసుకుని వారి తల్లి తండ్రులతో కూడా మాట్లాడి వారితో సాన్నిహిత్యంగా ఉంటూ, ఎన్నారైతో మాటలు కలుపుతూ అబ్బో ఓ రేంజ్ లో నటిస్తూ వారి జేబులు గుల్ల చేసే అమ్మాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎన్నారైలె టార్గెట్ గా చేసుకున్న ఆమెని అరెస్ట్ చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే...

 Image result for woman-arrested-for-cheating-nris-

పెళ్లి కాని ఎన్నారైలు టార్గెట్ గా చేసుకుని ఓ మహిళ మ్యాట్రిమోని సైట్లలోతన ఫోటోని అప్లోడ్ చేస్తుంది. వారితో నమ్మకంగా మాట్లాడుతూ వారి తల్లి తండ్రులతో కూడా సంభాషణలు కలుపుతుంది. అంతేకాదు వారితో షాపింగ్ లు అంటూ అటూ ఇటూ తిరుగుతూ డబ్బులు కొల్లగుడుతుంది. చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చక్కగా ఎస్కేప్ అవుతుంది కొమరం అర్చన అనే మహిళ. పేరుకి అర్చనానే కానీ మ్యాట్రిమోని సైట్లలో రకరకాల పేర్లతో అందరిని పరిచయం చేసుకుంటుంది.

 Image result for woman-arrested-for-cheating-nris-

ఆమె దెబ్బకి మోసపోయిన ఎంతో మంది సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేశారు. గతంలో ఇలాంటి నేరమే చేసిన ఆమె 5 నెలల జైలు శిక్షని కూడా అనుభవించి బయటకి వచ్చినా మళ్ళీ ఇలాంటి నేరాలకి పాల్పడుతూ వచ్చింది. అయితే ఓ ఎన్నారై  కుటుంభం ఇలాంటి సంఘటనే ఎదుర్కోవడంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలపన్నిన పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: