ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతుందీ అనడానికి మరో నిదర్శనం నారయణఖేడ్ ఉప ఎన్నికల్లో గెలుపు. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మరోసారి అధికార టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెరాస అత్యధిక ఓట్లు సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలుపు భాద్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావుకు అభినందల వెల్లువ కురిసింది.

మొన్న వరంగల్ ఉప ఎన్నికలు నిన్న గ్రేటర్ ఎలక్షన్లు.. నేడు నారయణఖేడ్ ఇలా ఎన్నికల్లో నిలబడిన ప్రతిసారీ టీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగిస్తుంది. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 19వ రౌండ్ ముగిసేసరికే ఆయన 50 వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. దీనిపై వేగంగా స్పందించిన టీఆర్ఎస్ యువనేత, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పార్టీ అభ్యర్థి విజయంపై ట్వీట్ చేశారు. ఎన్నికల్లో 50వేలకు పైగా అద్భుత మెజారిటీ సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్‌ మంత్రి హరీశ్‌రావుకు, నారాయణఖేడ్‌ పార్టీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

విజయోత్సవంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్


భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు మెదక్ జిల్లా పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్విట్టర్ లో ప్రత్యేక కామెంట్లను పోస్ట్ చేశారు. ఖేడ్ గెలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో బాణాసంచా కాల్చుతూ.. గులాబీ రంగులు పూసుకుంటూ.. డప్పు వాయిద్యాలకు టీఆర్‌ఎస్ నేతలు స్టెప్పులేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్‌ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నాయని నేతలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: