మనవణ్ణి చూడటానికి కూడా సమయం లేకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా చేసే సేవ ఏమిటి.  అంత త్యాగం చేయటమెందుకు, ఆయనకు మనవడితోనే ఉండే అవకాశము  లేదంటే అది త్యాగమా? ఏ  పసి బాలుడైనా తన తల్లి  తండ్రి తోనే ఉంటారు. ముఖ్యంగా తల్లితో.  లేగదూడలు కూడా తన తల్లి దగ్గరేఉంటాయి. అలాగే దేవాన్ష్ కూడా బ్రహ్మిణిగారి తోనే ఉంటారు. ఆమె తన వ్యాపారాల రీత్యా,  సంపాదించి ఆర్ధికంగా ఎదిగిపోవాలనే త్రుష్ణ తో హైదరాబాదు లో ఉంటారు. అలాగే భువనేస్వరిగారుకూడా హెరిటేజ్ తదితర వ్యాపారాల అభి వృద్ది కోసం హైదరాబాద్లో ఉంటారు.

 

లోకేష్ బహుశ అటూ ఇటూ తిరుగుతూ ఉండొచ్చు. ఇక చంద్రబాబు ఏపి ముఖ్యమంత్రి గా టిడిపి కి నాయకుడుగా ఆ రాష్ట్ర రాజధానిలో తను కోరుకునే గా అమరావతిలో ఉంటున్నారు. 10 సంవత్సరాలు చక్కగా హైదరాబాదును రాజధాని గా వినియోగించుకునే అవకాశమ్ను వదులుకోవటమెండుకు? ఇక్కడే కుటుంబమంతా కలసి మెలిసి ఉంటూ వారి వారి వ్యాపారాలు, వ్యవహారాలు, రాజకీయాలు చేసుకొంటూనే మనవడితో ముద్దూ, ముచ్చట పంచుకొంటూ వుందొచ్చుగా?  ఏపి ప్రజల సేవలో తనమునకలై మనవడిని కూడా చూడలేకున్న నంటూ త్యాగధనుడి గా పోజులు పెట్టటమెందుకు అని పరమార్ధమెరిగిన అనేక మంది వ్యాఖ్యానం చేస్తున్నారు.



 

మనవడి మీద ప్రేమను మీరు త్యాగం చేయవలసిన అవసరం లేదని, అనేకమంది మీపార్టిలోనే సిఎం పదవిని నిర్వహించగలరని....ఉదాహరణకు మీ తలోలో నాలుకైన కోడెల శివ ప్రసాద్, యనమల రామకృష్ణుడు లాంటి  వాళ్ళే కాక, బాలకృష్ణ, నారాయణ, బోండా, దేవినేని, ఆనం సోదరులు, జెసి సోదరులు ఇలా ఉండనే ఉన్నారు. వారికి మీ కుర్చీ ఇచ్చి మీరు మనవడితో క్రిష్ణా...రామా....అంటూ గడిపితే... దేశసే నిజంగా చేసినట్లే అనుకుంటున్నారనేకులు. అప్పుడు హైదరాబాద్ లో ఇంకా 10 యేళ్ళు అవసరమైతే 15 యేళ్ళ వరకు జాయింట్ కాపిటల్ లో తెలుగు వాళ్ళం కలసి ఉంటాం. ఇదంతా మీ ఓటు కు నోట్ దెబ్బేగా? ప్లీజ్ వివరించండి ప్రజలకోసం, ప్రజలకొరకు, ప్రజలచేత ఎన్నుకోబడ్ద మీరు. 


Image result for employees of AP


హైదరాబాద్ లో నివసించే ఆంధ్రప్రదేశ్ ఉద్యొగులు, కనీసం క్రింది తరగతుల వారు 10 సంవత్సరాలు హైదరాబాద్ లొనే ఉండి పనిచేసే వెసులు బాటు బాబు వ్యక్తిగత స్వార్ధ పరత్వం తో కోల్పోయామని విచారిస్తున్నారు. అంతేకాదు ప్రతిసారి ఉద్యోగుల విషయములో తాను కుటుంబాన్ని వదలి అమరావతిలో బస్లో కూడా కాపురం చేస్తున్నట్లు, ఒంటరి బ్రతుకీడుస్తున్నట్లు పదే పదే మనవడిని కూడా చూడకుండా గడుపుతునానటం వారికి నచ్చటంలేదు. తనిప్పటికే ప్రజాధనం 80 కోట్లు ఐడు కాంపు ఆఫ్ఫిసులకు ఖర్చుచేశారు. ఆయనైతే ముఖ్యమంత్రి ఏమైనా, ఎంతైనా తనకొరకు ప్రజాధానాన్ని తగలెయ్యగలడని, ఆయనకు ఆయన హోదాలో అనేక వెసులుబాట్లు, సౌకర్యాలు, సెక్యూరిటి, భవనాలు అందుబాటులో ఉంటాయి. తనకు కాలేజిలో చదివే పిల్లలై తమకు తెలిసినంతవరకు లేరనీ, తమకు ఆ సమస్యలు ఉన్నాయని, పెరిగే ఖర్చులు ప్రభుత్వం ఇవ్వబోయే అలవెన్సులతో తీరవని తమ వ్యధల పరంపర వివరిస్తున్నారు.

 

అనేక మంది కూడా ఇదే విషయములో ఉద్యోగులతో ఏకీభవిస్తున్నారు. ఆయనైతే అందరిని త్యాగంచేయమంటారు, ఆయన దేశ విదేశాలలో తిరుగుతూ, ఒకే పనికి పలుమార్లు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ, అనేక కాంపు ఆఫీసుల సుందరీకరణకు విపరీతంగా, ధారాళంగా, ప్రజాధనం ఖర్చు చేయటమే కాకుండా అతు అమరావతిలోను, ఇటు హైదరాబాదు లోను కుటుంబంకోసం వసటులు అనుభవిస్తూ తిరిగి మనవణ్ణి చూడలెక పోతున్నననే బీద భ్రమలు ప్రజలకు చెప్పటమెందుకు అంటున్నారు. ఇంట్లొ ఉన్న నలుగురూ విపరీత సంపాదన చేస్తూ తామేదో ఆంధ్ర ప్రజలకోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నామనటమేమి న్యాయమని? ప్రశ్నిస్తున్నారు. 24 * 7 - రోజుకు పద్దెనిమిది (పని గంటలు ఎనిమిది  మించితే పనిలో గుణాత్మ విలువ పడిపోతుందంటున్నారు) అకూడదంటున్నారు) గంటలు పనిచేసే వారి పనితనం తిరోగమనమే అని విజ్ఞులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి లో ఇళ్ళు అద్దెకు దొరకటం సులభం కాదని అక్కడ కులం ప్రాధాన్యం చాలా ఎక్కువని, రెంట్స్ కూడా ధారుణమని అంటున్నారు.

 

ఇక బాబుగారే అలోచించాలి. తనస్వార్ధం, తనని కాక తనరాష్ట్రాన్ని, ఉద్యోగులను ముంచుతుందని... ఈ విభజన ఫలం వాడుకోక పోతే రేపు బిజేపి విభజన వలన వచ్చిన ప్రయోజనాన్ని కూడా వినియోగించు కోవటం లేదని అంటారు. ఆంధ్రా ప్రదేశ్, ఈ నష్టంతొ మరో విశ్వనగరాన్ని నిర్మించగల సంపదను కోల్పోతుందంటున్నారు కొందరు ఆర్ధక వేత్తలు.


మరింత సమాచారం తెలుసుకోండి: