కామాతురానాం..న భయం న లజ్జ..అన్నట్లు కామంతో ఈ మద్య కొందరు విపరీతమైన సెక్స్ పోకడలకు పోతూ.. ఎంత నీచానికి దిగజారుతాయో చెప్పడానికి ఇదో పెద్ద  ఉదాహరణ. కేరళలోని పెరుంబవూరులో సంచలనం రేపిన దళిత మహిళ అత్యాచార ఘటనలో అరెస్టయిన నిందితుడు అమీరుల్ ఇస్లాం నుంచి నివ్వెరపోయే విషయాలు రాబడుతున్నారు పోలీసులు. అతడు చెప్పె కొన్ని నగ్నసత్యాలు చూసి నిజంగానే నివ్వెరపోతున్నారు. దళిత మహిళ జిషా(30)  పై అత్యాచారం హత్య కేసులో అరెస్టయిన నిందితుడు అమీరుల్ ఇస్లాంపై తాజాగా మరో కేసు నమోదైంది. మేకతో అసహజ సెక్స్ లో పాల్గొన్నందుకు గాను అతనిపై తాజా కేసు నమోదైనట్టు సమాచారం.  

అసోం నుంచి వలస కార్మికుడిగా కేరళకు వచ్చిన అమీరుల్ పెరుంబవూరులో బస చేసి  లాడ్జి పక్కన మేకతో అసహజ కార్యకలాపాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేయగా, మేక గాయపడినట్టు గుర్తించారు.

లాడ్జి యజమాని ఫిర్యాదు మేరకు అమీరుల్పై కేసు నమోదు చేశారు. నిందితుడు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేయగా, మేక గాయపడినట్టు గుర్తించారు. లాడ్జి యజమాని ఫిర్యాదు మేరకు అమీరుల్పై కేసు నమోదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: