పాకిస్తాన్ హాట్ మోడల్ బలోచ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మోడలింగ్ అంటే బలోచ్ కు యమా క్రేజ్.. ఎప్పుడూ హాట్ హాట్ వీడియోలు, సెల్ఫీలు ఇంటర్ నెట్లో లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. రెచ్చగొట్టే కామెంట్లు పెడుతూ సందడి చేస్తుంటుంది. 

ఐతే.. ఇలాంటి అమ్మాయి జీవితం అనూహ్యంగా సొంత అన్న చేతిలోనే ముగిసిపోయింది. బలోచ్ అన్న వసీంకు చెల్లిలి వరస అస్సలు నచ్చేది కాదు.. ఇలాంటి శృంగార చేష్టలు చేయవద్దని చాలాసార్లు హెచ్చరించాడట. అయినా బలోచ్ వాటిని చాలా లైట్ గా తీసుకుంది. అలాగే అంటాడు ఏం చేస్తాడులే అనుకుంది. 


కానీ చెల్లెలి అసభ్య ప్రవర్తనతో ఆమె అన్నగా అవమానంగా ఫీలైన వసీం.. ఆమెతో గొడవ పడి ఏకంగా హత్య చేశాడు. రంజాన్‌ పండగ వేడుకల్లో పాల్గొనడానికి సొంతూరు ముల్తాన్‌ వచ్చిన బలోచ్‌ను సొంత ఇంట్లోనే సోదరుడు చంపేశాడట. బలోచ్ కు గతంలోనూ వేరే కొందరు చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారట. 

ఇటీవలే ఆమె తన చివరి వీడియో బ్యాన్ ను విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తానే ఖందీల్ ను హత్య చేసినట్లు పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం వసీం  ఒప్పుకొన్నాడు. పాకిస్థాన్ పోలీసుల వద్ద వసీం వాంగ్మూలం ఇస్తూ...తన సోదరి వద్దని చెప్తున్నప్పటికీ మోడలింగ్ వైపు మళ్లిందని పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: