ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సిరియా, అరబ్ దేశాల్లో ఈ దాడులు మరీ మితిమీరం..అక్కడ ప్రజలు ఎందుకు పుట్టాంరా ఈ భూమిపై అని అనుకునే రీతిలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు, ఊచకోతలతో మరణమృదంగం కొనసాగుతుంది. ఏ మూల నుంచి ఎప్పుడు బాంబు దాడులు జరుగుతాయో తెలియన దుస్థితిలో అక్కడి దేశ ప్రజలు బతుకుతున్నారు. ఈ మద్య సిరియాలో జరుగుతున్న మారణ హోమంపై ఎన్నో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఓ చిన్నారి తనకు రక్తం కారుతున్న ఉలుకూ పలుకూ లేకుండా జీవచ్ఛవంలా కుర్చిపై కూర్చొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

తాజాగా ఓ యాంకర్ దీనికి సంబంధించిన కథనాన్ని చదువుతూ ఉద్వేగంతో కన్నీరు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. సిరియాలో ఈ మద్య ఉగ్రవాదులు మరీ రెచ్చిపోతున్నారు..ప్రతిరోజు ఎక్కడో అక్కడ బాంబులతో దాడులు చేయడం గన్ తో పేల్చడం..ఇలా రోజూ విద్వంసాలకు పాల్పడుతున్నారు. అక్కడ ప్రజలు ఎప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు ప్రతి క్షణం పోరాడుతూనే ఉన్నారు. పిల్లలతో కలిసి ఆటలాడుకోవాల్సిన సమయంలో రక్తపుటేర్ల మధ్య భయంభయంగా బతుకీడ్చాల్సిన భయంకర దుస్థితి.  
Image result for syria bomb blast
ఈ మద్య ఓ బాంబు దాడిలో చెల్లా చెదురైన తన ఇంటి నుంచి చిన్నారిని కాపాడి ఓ కుర్చిలో కూర్చొబెట్టారు. ఆ బాబుకు ఒంటినిండా గాయాలు అయినా కూడా నిశ్చేష్టుడిగా కూర్చుండి పోయాడు. కంటి నుంచి కన్నీళ్లు రావడం లేదు..రక్తమే వస్తుంది..నొప్పి తెలియలేదు.  ఆ చిన్నారి పేరు ఒమ్రాన్ దక్నీష్. వయసు 5 ఏళ్ళు.సిరియాలోని అలెక్ర్పోలో జరిగిన బాంబుదాడిలో తనవారంతా కళ్లముందే ప్రాణాలు కోల్పోయి.. తనతో పాటు 12 మంది చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
Image result for syria bomb blast

రక్తం కారుతున్న ముఖాన్ని తుడుచుకుంటూ ఇంకా తనకోసం ఎవరు వస్తారు..ఎవ్వరు ఉన్నారు అని ప్రశ్నిస్తూ కనిపించింది..నిర్వేదం ఆ కళ్లలో కనిపిస్తుంది.  రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని అంబులెన్స్ బృందాలు వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటనను కళ్లకు కడుతూ న్యూస్ చదివిన సీఎన్‌ఎన్ యాంకర్ ఉద్వేగాన్ని ఆపుకోలేక.. ఆ చిన్నారి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: